త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హ‌రీశ్ రావు

Harish Rao | రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తుంటే.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్న‌ద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు.

G

Telangana | Published On Aug 24, 2026, 12.34 pm IST

Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తుంటే.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్న‌ద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. కానీ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆఘమేఘాల మీద విడుదల చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు.

యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) ఇవ్వని మీకు, మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుక‌ని ప్ర‌శ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధా? అని నిల‌దీశారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్ మోసం అని మండిప‌డ్డారు. రాజీవ్ యువ వికాసం.. వికసించక ముందే వాడిపోయింద‌ని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలకు గతి లేకుండా పోయింద‌ని విమ‌ర్శించారు. రేవంత్ పగ.. యువత దగ అన్నట్లుగా ప‌రిస్థితి తయారైందన్నారు. జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు (Liquor Notification) ఫుల్.. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని మండిప‌డ్డారు.

Advertisement
Advertisement