Train Ticket | రైల్వే నిర్వాకం.. 52 బెర్తులున్న బోగీలో 54వ నంబర్ టికెట్ జారీ!
Train Ticket | రైలు ప్రయాణానికి టికెట్ (Train Ticket) దొరకడమే కాదు.. అది కన్ఫర్మ్ అవ్వడమూ కష్టమే. కానీ ఓ వ్యక్తికి మాత్రం టికెట్ బుక్‌చేసుకోవడంతోనే బెర్త్ కన్ఫర్మ్ (Confirmed Ticket) అయింది. దీంతో ఎగిరి గంతేసిన అతడికి.. తీరా రైలు (Indian Railways) ఎక్కిన తర్వాత అసలు కష్టం మొదలైంది.
Train Ticket | త్రినేత్ర న్యూస్: రైలు ప్రయాణానికి టికెట్ (Train Ticket) దొరకడమే కాదు.. అది కన్ఫర్మ్ అవ్వడమూ కష్టమే. కానీ ఓ వ్యక్తికి మాత్రం టికెట్ బుక్‌చేసుకోవడంతోనే బెర్త్ కన్ఫర్మ్ (Confirmed Ticket) అయింది. దీంతో ఎగిరి గంతేసిన అతడికి.. తీరా రైలు (Indian Railways) ఎక్కిన తర్వాత అసలు కష్టం మొదలైంది. తనకు కేటాయించిన బెర్త్ (Berth) అసలు ఆ బోగీలోనే లేదని తెలుసుకుని షాకవ్వడం అతని వంతయ్యింది.
ఇషాన్ బాజ్‌పాయ్ (Ishan Bajpai) అనే వ్యక్తి వారణాసి సిటీ-నేపాల్‌గంజ్ రోడ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15132)లో వారణాసి సిటీ (Varanasi City) నుంచి గోరఖ్‌పూర్ జంక్షన్‌కు టికెట్ బుక్‌చేసుకున్నారు. ఆయనకు ఏసీ2-టైర్ కోచ్ (A1)లో 54వ నంబర్ బెర్త్ కేటాయించారు. కానీ ఆ బోగీలో మొత్తం 52 బెర్తులు మాత్రమే ఉన్నాయి. నవంబర్ 22న రైలు ఎక్కిన తర్వాత తనకు కేటాయించిన బెర్త్ లేకపోవడం, అందులో 52 బెర్తులే ఉండటం చూసి అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇదే విషయమై రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు ఫిర్యాదు చేయడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (X) వేదికగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. రాత్రి 10.45 గంటల సమయంలో తన బెర్త్ కోసం కోచ్ అంతా వెతుకుతున్న వీడియోతో పాటు, తన కన్ఫర్మ్ టికెట్ స్క్రీన్‌షాట్‌ను బాజ్‌పాయ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
కాగా, సాఫ్ట్‌వేర్ లోపం వల్ల పొరపాటు జరిగిందని, దీనిపై తగిన దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని వారణాసి (Varanasi) డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (Sr DCM) తెలిపారు. దీనివల్ల బాజ్‌పాయ్‌తోపాటు మరో ప్రయాణికుడు కూడా ఇబ్బంది పడ్డారని, వారిద్దరికీ అదే కోచ్‌లో ప్రత్యామ్నాయ బెర్తులను కేటాయించామని చెప్పారు.
ఏసీ 2-టైర్ కోచ్‌ల్లోని బెర్తుల్లో తేడాలు ఎందుకు?
ఒకే కేటగిరీకి చెందిన రైల్వే కోచ్‌ల నిర్మాణంలో ఉండే తేడాయే ఈ పొరపాటుకు కారణం. ఒకే తరగతికి (Travel Class) చెందిన అన్ని రైలు బోగీల్లోనూ సమాన సంఖ్యలో బెర్తులు ఉండవు. వాటి డిజైన్, నిర్మాణాన్ని బట్టి సామర్థ్యం మారుతూ ఉంటుంది. పాత నీలం లేదా బిస్కెట్ రంగులో ఉండే సంప్రదాయ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఏసీ 2-టైర్ కోచ్‌లలో సాధారణంగా 46 బెర్తులు ఉంటాయి. అదే ఎరుపు-బూడిద రంగులో ఉండే కొత్త తరం లింకే హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లలో ప్రయాణికుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే రైల్వే అధికారిక పత్రాల్లో ఎల్‌హెచ్‌బీ (LHB) ఏసీ 2-టైర్ కోచ్‌ల సామర్థ్యం 52, 54 అని రెండు రకాలుగా రికార్డయింది.
2022 జూన్‌లో సవరించిన ఎల్‌హెచ్‌బీ మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం.. ఎల్‌హెచ్‌బీ ఏసీ 2-టైర్ కోచ్‌లలోని రెండు వేరియంట్లైన LWACCW, LWGACCW కోడ్‌లు కలిగిన బోగీలలో ఒక్కొక్కదానిలో 52 బెర్తులు ఉన్నట్లు రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే, బాజ్‌పాయ్ ప్రయాణించిన రైలును నడిపే నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్‌కు చెందిన 2020 నాటి సాంకేతిక పరీక్షా మెటీరియల్‌లో మాత్రం ఎల్‌హెచ్‌బీ ఏసీ 2-టైర్ కోచ్ సామర్థ్యం 54 బెర్తులుగా ఉంది. అందువల్ల ఏసీ 2-టైర్ కోచ్‌లో 52 బెర్తులు ఉండటం సాధరణ విషయమే. 2 ఏసీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 52 బెర్తులు, 54 బెర్తులు ఉన్న రెండు రకాల బోగీలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. 52 బెర్తులు ఉండే కొత్త తరం ఎల్‌హెచ్‌బీ ఏసీ 2-టైర్ కోచ్‌లలో అదనపు రెండు బెర్తుల స్థలాన్ని ప్రయాణికులకు అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, దిండ్లు (లినెన్) భద్రపరిచే స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌గా మార్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Special Trains | పండుగల రద్దీ.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!
నవంబర్ 24, 2026

Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్పూర్కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే
నవంబర్ 23, 2026

RAC | ప్రయాణికులకు షాక్ ఇవ్వబోతున్న రైల్వే.. త్వరలో ఆర్ఏసీ టికెట్లకు మంగళం..?
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Adilabad | మేనత్త కొడుకుని ప్రేమించిందని.. చున్నీతో ఉరేసి చంపేశాడు..
- ●Fuel Tanker | హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. భారీ పేలుడుతో 31 మంది సజీవ దహనం
- ●Road Accident | పెండ్లి బృందం తుఫాన్‌ను ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం
- ●College Hostel | డిగ్రీ కాలేజీ హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి
- ●Horoscope | నవంబర్ 26 రాశిఫలాలు.. ఈ రాశివారికి చిన్న ప్రయాణాలు లాభదాయకం!
- ●Bala Maya Devi | అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోవద్దు

Adilabad | మేనత్త కొడుకుని ప్రేమించిందని.. చున్నీతో ఉరేసి చంపేశాడు..

Fuel Tanker | హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. భారీ పేలుడుతో 31 మంది సజీవ దహనం

Road Accident | పెండ్లి బృందం తుఫాన్‌ను ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం

College Hostel | డిగ్రీ కాలేజీ హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి



