త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత

Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

S

National | Published On Nov 23, 2026, 7.48 am IST

Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్ : తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుచిరాపల్లి జిల్లాలో వేగంగా దూసుకువచ్చిన కారు వేప చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న‌ 8 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. నమక్కల్ జిల్లాలో ఓ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వేప చెట్టుకు బలంగా కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు.

రాష్ట్రపతి, ప్రధాని, సీఎం విజ‌య్ తీవ్ర దిగ్భ్రాంతి

తమిళనాడు రోడ్డుప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని మోదీ, సీఎం విజ‌య్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్ర‌ధాని మోదీ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందింస్తామని ప్రధాన వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement