త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | లోయ‌లోప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి

Road Accident | ఉత్త‌రాఖండ్ (Uttarakhand)లోని తెహ్రీ గ‌ర్వాల్ (Tehri Garhwal) జిల్లాలో బ‌స్సు అదుపుత‌ప్పి 100 మీట‌ర్ల లోతైన లోయ‌లోకి ప‌డిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయ‌ప‌డ్డారు.

D

National | Published On Nov 17, 2026, 11.44 am IST

Road Accident | లోయ‌లోప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌రాఖండ్ (Uttarakhand)లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తెహ్రీ గ‌ర్వాల్ (Tehri Garhwal) జిల్లాలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లోకి ప‌డిపోయింది (Bus Plunged Into A Gorge). ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. ప‌దుల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు.

బ‌స్సు హ‌రిద్వారా నుంచి చ‌మోలీ వైపు వెళ్తోంది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4:30 గంట‌ల స‌మ‌యంలో గులార్ బజార్ (Gular Bazaar) సమీపంలోకి రాగానే బ‌స్సు అదుత‌ప్పి వంతెన‌పై నుంచి 100 మీట‌ర్ల లోతైన లోయ‌లోకి ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో సుమారు 40 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 26 మంది గాయ‌ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు. స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించింది. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము (President Droupadi Murmu) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

Also Read..

విశాఖలో 170 సినిమాల 'లక్కీ' బీచ్.. ఆనంద్ మహీంద్రాను సైతం కట్టిపడేసిన గంగవరం అందాల వెనుక కథ ఇదే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా : మంత్రి తుమ్మ‌ల‌

రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి..!

Advertisement
Advertisement