త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi | ఢిల్లీలో కుప్ప‌కూలిన భ‌వ‌నం పైక‌ప్పు.. చిన్నారి స‌హా ఇద్ద‌రు మృతి

Delhi | ఢిల్లీలోని వివేక్ విహార్ (Vivek Vihar) ప్రాంతంలో ఓ భ‌వ‌నం పైక‌ప్పు ఒక్క‌సారిగా కూలిపోయింది (roof of a house collapsed). ఈ ఘ‌ట‌న‌లో చిన్నారి స‌హా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Nov 17, 2026, 12.02 pm IST

Delhi | ఢిల్లీలో కుప్ప‌కూలిన భ‌వ‌నం పైక‌ప్పు.. చిన్నారి స‌హా ఇద్ద‌రు మృతి
Advertisement

Delhi | త్రినేత్ర న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ (Vivek Vihar) ప్రాంతంలో ఓ భ‌వ‌నం పైక‌ప్పు ఒక్క‌సారిగా కూలిపోయింది (roof of a house collapsed). ఈ ఘ‌ట‌న‌లో చిన్నారి స‌హా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. భ‌వ‌న శిథిలాల కింద ప‌లువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలోని వివేక్ విహార్ ఫేజ్-2 ప్రాంతంలో మంగళవారం ఉదయం 10 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్రమాదం జరిగింది. రెండంత‌స్తుల భ‌వనంపై క‌ప్పు కూలిపోయిన‌ట్లు అధికారులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో మూడేళ్ల‌ చిన్నారితోపాటూ మ‌రో వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌రో ఎనిమిది మంది వ‌ర‌కూ భ‌వ‌న శిథిలాల కింద చిక్కుకుని ఉంటార‌ని భావిస్తున్నారు. స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. భవనం కూలిపోవడానికి గల కచ్చితమైన కారణాలు తెలియ‌రాలేదు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవ‌లే రాజ‌ధాని న‌గ‌రంలో వ‌రుస‌గా భ‌వ‌నాలు కూలిపోతున్న ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఢిల్లీలోని చావ్రీ బజార్, పహార్‌గంజ్ ప్రాంతాల్లో కూడా భవనాలు కూలిన ఘటనలు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో ఢిల్లీ వాసులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read..

లోయ‌లోప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి

విశాఖలో 170 సినిమాల 'లక్కీ' బీచ్.. ఆనంద్ మహీంద్రాను సైతం కట్టిపడేసిన గంగవరం అందాల వెనుక కథ ఇదే!

జీహెచ్ఎంసీ పార్కుల్లో ప్ర‌వేశ రుసుము పెంపు..!

Advertisement
Advertisement