PM Modi | విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయి.. శిక్ష తప్పదు : మహిళా కోటా బిల్లుపై ప్రధాని మోదీ
PM Modi | మహిళా రిజర్వేషన్లకు సంబంధించి తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై (opposition) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
PM Modi | మహిళా రిజర్వేషన్లకు సంబంధించి తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై (opposition) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా విపక్షాలు క్షమించరాని తప్పు (unforgivable mistake) చేశాయని వ్యాఖ్యానించారు. వారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. "ఈ బిల్లును వ్యతిరేకించి విపక్ష ఎంపీలు క్షమించరాని తప్పు చేశారు. వారు మహిళలను నిరాశపరిచారు. అందుకు మహిళలకు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఈ బిల్లును అంగీకరించనివారు తమ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు" అని ప్రధాని వ్యాఖ్యానించారు.
అయితే, మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని విపక్షాలు చెబుతున్నాయి. డీలిమిటేషన్‌తో ఈ అంశాన్ని ముడిపెట్టడం సరికాదని వాదిస్తున్నాయి. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయటానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి.
Also Read..
2023లో పాసైన బిల్లును తిరిగి తెస్తే మద్దతిస్తం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మహిళా రిజర్వేషన్లు.. పాత చట్టాన్నే అమలు చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






