PM Modi | దేశంలోనే మొట్టమొదటి.. మహిళా ఆపరేటర్లతో నడిచే మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi | భారతదేశంలో మెట్రో రైల్ నెట్‌వర్క్ (India’s metro network) గత దశాబ్ద కాలంలో అసాధారణమైన వృద్ధిని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. రూ. 8,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 23 కిలోమీటర్ల పొడవైన పుణే మెట్రో లైన్ 3 (పింక్ లైన్)ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : భారతదేశంలో మెట్రో రైల్ నెట్‌వర్క్ (India’s metro network) గత దశాబ్ద కాలంలో అసాధారణమైన వృద్ధిని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. 2014కి ముందు 248 కిలోమీటర్లు మాత్రమే ఉన్న ఆపరేషనల్ మెట్రో నెట్‌వర్క్ ప్రస్తుతం 1,200 కిలోమీటర్లకు విస్తరించిందని చెప్పారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో పట్టణ రవాణా మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని నొక్కిచెప్పారు.
రూ. 8,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 23 కిలోమీటర్ల పొడవైన పుణే మెట్రో లైన్ 3 (పింక్ లైన్)ను (Pune Metro Line 3) ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా సుమారు రూ. 21,800 కోట్ల వ్యయంతో ఫేజ్-II కింద మరో నాలుగు కొత్త మెట్రో కారిడార్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. "2014లో దేశానికి సేవచేసే అవకాశం ఎన్డీయేకి లభించింది. నగరాల్లో నివసించే మధ్యతరగతి ప్రజలకు జీవన సౌలభ్యం, రవాణా సౌలభ్యం కల్పించాలనే సంకల్పంతో మేం ముందుకు వెళ్లాం. అప్పట్లో 248 కిలోమీటర్లు మాత్రమే ఉన్న ఆపరేషనల్ మెట్రో నెట్‌వర్క్.. ఇప్పుడు 1,200 కిలోమీటర్లకు చేరుకుంది" అని పేర్కొన్నారు.
పూర్తిగా మహిళలతోనే నడిచే మెట్రోలైన్
పూణే పింక్ లైన్ విషయానికొస్తే (Pune Metro Pink Line).. దీన్ని పూర్తిగా మహిళా ఆపరేటర్లే నిర్వహించనున్నారు. మహిళా సిబ్బందితో నడిచే మొట్టమొదటి మెట్రో లైన్ ఇదే కావడం విశేషం. దీనికి అవసరమైన విద్యుత్ అవసరాల్లో 30 శాతం సౌర విద్యుత్ ద్వారానే సమకూర్చనున్నారు. మాన్ (హింజవడి) నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు (శివాజీనగర్) మెట్రో స్టేషన్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. ఈ మెట్రో లైన్ ద్వారా పూణేలోని ప్రధాన ఐటీ హబ్ అయిన హింజవడిని శివాజీనగర్‌తో అనుసంధానించడం ద్వారా వేలాది మంది ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నిత్యం ట్రాఫిక్‌లో నరకం చూసే వేలాది మంది టెక్కీలకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
Also Read..
ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
నిరసనల పేరుతో ఒకే స్థలాన్ని ఆక్రమించుకోలేరు : సుప్రీంకోర్టు
దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చర్యలపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Radhika Apte | మొన్న జాన్వీ కపూర్... నేడు రాధిక ఆప్టే - టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు
- ●TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..
- ●Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు
- ●Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- ●Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి "కాకా" విలన్ - వారెంట్ జారీ చేసిన కోర్టు
- ●WhatsApp | వాట్సాప్ గ్రూప్‌లలో 4 కొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్ మరింత ఈజీ..

Radhika Apte | మొన్న జాన్వీ కపూర్... నేడు రాధిక ఆప్టే - టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు

TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..

Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు

Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం






