Radhika Apte | మొన్న జాన్వీ కపూర్… నేడు రాధిక ఆప్టే – టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు
ఇటీవల టాలీవుడ్‌పై జాన్వీకపూర్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదం మరువక ముందే మరో బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది. ఓ సినిమాలో తనకంటే వయసులో చాలా పెద్ద వాడైన హీరోతో రొమాన్స్ చేయాల్సివచ్చిందంటూ సెటైర్లు వేసింది. చాలా ఇబ్బందిపడుతూ షూటింగ్‌లో పాల్గొన్నానని అన్నది.
Entertainment | Published On Nov 3, 2026, 2.56 pm IST
Radhika Apte | ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో టాలీవుడ్ ఇండస్ట్రీపై జాన్వీకపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హీరోయిన్లకు తెలుగు దర్శకులు పూర్తి కథలను వినిపించరని, షూటింగ్‌లో కెమెరా యాంగిల్స్ ఎక్కడ ఎలా పెడతారో కూడాచెప్పరని అన్నది. తెలుగు సినిమాల్లో దర్శకులు చెప్పినట్లు చేయాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేసింది. ఆమె కామెంట్లపై పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదం మరువక ముందే మరో బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించింది.
అక్క వెబ్‌సిరీస్...
రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన అక్క వెబ్‌సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ వెబ్‌సిరీస్‌లో రాధిక ఆప్టేతో పాటు కీర్తి సురేష్ మరో లీడ్ రోల్ చేసింది. ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై రాధిక ఆప్టే రియాక్ట్ అయ్యింది. ఓ సినిమాలో తనకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో రొమాన్స్ చేయాల్సివచ్చిందని , పురుషాధిక్యతతో కూడిన ఆ మూవీలో చాలా కష్టంగా నటించానని అన్నది.
సొంత మేనమామనే...
"ఆ సినిమాలో కథానుగుణంగా నేను సొంత మేనమామనే పెళ్లిచేసుకోవాల్సివస్తుంది. పైగా హీరో నా కంటే వయసులో చాలా పెద్దవాడు. అతడితో రొమాంటిక్ సీన్లలో నటించడం చాలా కష్టమైంది. పురుషాధిక్యతను ప్రోత్సహించేలా కథ సాగడం, హీరోయిన్లకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ అయిష్టంగానే సినిమాను పూర్తిచేశా. ఆ సినిమాలో నా పాత్రను చనిపోయినట్లు చూపించి మధ్యలోనే ముగించారు. అదే మంచిదని అనుకున్నా. నా కెరీర్‌లో చాలా అసహ్యంగా ఫీలైన పాత్ర అంటే అదే" అంటూ సెటైరికల్‌గా కామెంట్లు చేసింది. ఆ సినిమాతో పాటు హీరో పేరును మాత్రం చెప్పలేదు.
బాలీవుడ్ బ్యూటీపై విమర్శలు
బాలకృష్ణ లెజెండ్ సినిమాను ఉద్దేశించే రాధికా ఆప్టే ఈ కామెంట్లు చేసిందని నెటిజన్లు అంటున్నారు. ఈ బాలీవుడ్ బ్యూటీపై విమర్శలు గుప్పిస్తున్నారు. పేరు, గుర్తింపు కోసం తెలుగులో సినిమాలు చేయడం, అవసరం తీరిన తర్వాత టాలీవుడ్‌ను ట్రోల్ చేయడం ప్యాషన్‌గా మారిపోయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. . బాలీవుడ్‌లో చేసిన బోల్డ్ పాత్రలతో పోలిస్తే తెలుగు దర్శకులు రాధిక ఆప్టేను పద్దతిగా చూపించారని అంటున్నారు. జాన్వీకపూర్, రాధిక ఆప్టేలకు తెలుగు దర్శకులు అవకాశాలు ఇవ్వొద్దని కామెంట్లు పెడుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mrunal Thakur | 15 కోట్ల బడ్జెట్ – కోటి కలెక్షన్స్ – ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ డిజాస్టర్ మూవీ
నవంబర్ 2, 2026

Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్షమాపణలు..!
నవంబర్ 2, 2026

Priyanka Chopra | ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా షార్ట్ ఫిల్మ్ – ఏఐ వల్ల ఉద్యోగాలు పోతే!
నవంబర్ 1, 2026
తాజావార్తలు
- ●TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..
- ●Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు
- ●Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- ●Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి "కాకా" విలన్ - వారెంట్ జారీ చేసిన కోర్టు
- ●WhatsApp | వాట్సాప్ గ్రూప్‌లలో 4 కొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్ మరింత ఈజీ..
- ●Supreme Court | నిరసనల పేరుతో ఒకే స్థలాన్ని ఆక్రమించుకోలేరు : సుప్రీంకోర్టు

TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..

Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు

Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి "కాకా" విలన్ - వారెంట్ జారీ చేసిన కోర్టు



