Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి “కాకా” విలన్ – వారెంట్ జారీ చేసిన కోర్టు
బ్రహ్మణ వర్గానికి వ్యతిరేకంగా గత ఏడాది చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై సూరత్ కోర్టు వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసు విచారణకు ఒక్కసారి కూడా హాజరుకాకపోవడంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Entertainment | Published On Nov 3, 2026, 2.14 pm IST
Anurag Kashyap | ప్రస్తుతం చిరంజీవి కాకా సినిమాలో విలన్‌గా నటిస్తోన్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఈ డైరెక్టర్‌పై సూరత్ కోర్టు వారెంట్‌ను జారీ చేసింది. బ్రహ్మణులకు వ్యతిరేకంగా గత ఏడాది అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ లాయర్ కమ్లేష్ రావల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించడమే కాకుండా మతవిద్వేషాలను రెచ్చగొట్టాడంటూ బీఎన్ఎస్ సెక్షన్స్ 192, 352, 352 (2) ప్రకారం ఈ బాలీవుడ్ దర్శకుడిపై కేసు నమోదు అయ్యింది.
బెయిలబుల్...
ఈ కేసులో అనురాగ్ కశ్యప్‌కు రెండు సార్లు కోర్టు సమన్లు జారీ చేసింది. అయినా అతడు కోర్టుకు హాజరుకాకపోవడం, విచారణకు సహకరించకపోవడతో అతడిపై సోమవారం బెయిల్ తో కూడిన వారెంట్‌ను జారీ చేసింది. డిసెంబర్ 24న తదుపరి విచారణ జరుగనుందని, తప్పనిసరిగా కోర్టుకు రావాలని అనురాగ్ కశ్యప్‌ను సూర్ కోర్టు ఆదేశించింది.
పూలే ట్రైలర్...
గత ఏడాది ఏప్రిల్‌లో పూలే మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చెలరేగిన వివాదాన్ని ఉద్దేశిస్తూ బ్రహ్మణ వర్గాన్ని కించపరుస్తూ అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. ఓ వ్యక్తికి బదులు ఇచ్చే క్రమంలో మాటజారానంటూ చెప్పారు.
నటుడిగా....
ఒకప్పుడు బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగారు అనురాగ్ కశ్యప్. బ్లాక్‌ఫ్రైడే, గులాల్, దేవ్ డీ, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ లాంటి సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్నారు. గత కొన్నాళ్లుగా యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టిన అనురాగ్ కశ్యప్ దక్షిణాదిలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి కాకాలో విలన్‌గా నటిస్తున్నాడు. అడివిశేష్ గూఢచారిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | నిరసనల పేరుతో ఒకే స్థలాన్ని ఆక్రమించుకోలేరు : సుప్రీంకోర్టు
- ●LG India | ఎల్జీ టీవీలు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. 170కి పైగా ఫ్రీ చానల్స్..
- ●Jagadeesh Reddy | 27 వేల మెగావాట్ల కరెంటుంది.. ఇంకా కొత్తగా కొని ఏం చేస్తరు?
- ●Bombay High Court | దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చర్యలపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- ●Temple Wearable | తలకు ధరించే సరికొత్త వేరబుల్ డివైస్.. భారత్‌లో అమ్మకాలు షురూ.. ఏంటిది, ఎలా పనిచేస్తుంది..?
- ●Indian Navy | ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్.. సముద్ర దొంగల ఆటకట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం

Supreme Court | నిరసనల పేరుతో ఒకే స్థలాన్ని ఆక్రమించుకోలేరు : సుప్రీంకోర్టు

LG India | ఎల్జీ టీవీలు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. 170కి పైగా ఫ్రీ చానల్స్..

Jagadeesh Reddy | 27 వేల మెగావాట్ల కరెంటుంది.. ఇంకా కొత్తగా కొని ఏం చేస్తరు?

Bombay High Court | దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చర్యలపై బాంబే హైకోర్టు ఆగ్రహం





