2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం
2027 UP Assembly Elections | 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ త్రిముఖ వ్యూహం అమలు చేయబోతోంది. ప్రాంతీయ, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు కార్యాచరణ రూపొందించింది.
2027 UP Assembly Elections | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (2027 UP Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే దీపావళి పండుగ తర్వాత మూడు అంచెల (Three-Tier) ప్రచార కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ ప్రచార కార్యక్రమాలకు సన్నాహకాలు చేస్తోంది. ప్రాంతీయ, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు కార్యాచరణ రూపొందించింది.
ఈ ప్రచార కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) నాయకత్వం వహించనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో యూపీలోని మొత్తం 18 పరిపాలనా విభాగాల ప్రధాన కార్యాలయాల్లో భారీ బహిరంగ సభలు, మెగా ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. జిల్లా స్థాయి బాధ్యతలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగి తమ భుజాన వేసుకున్నారు. ప్రచార తొలి విడతలో భాగంగా అమిత్ షా వివిధ ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తల సమ్మేళనాలు, బూత్ స్థాయి సదస్సులో పాల్గొంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇతర సీనియర్ నేతలతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు, పాదయాత్రలు, స్థానిక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ బలోపేతం చేయనున్నారు.
నవంబర్ 3 నుంచి ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు, సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాద యాత్రలు నిర్వహించనున్నారు. నవంబర్ 20 తర్వాత ప్రచారం జోరందుకోనుంది. అదే సమయంలో బీజేపీ తన బూత్ స్థాయి యంత్రాంగాన్ని కూడా రంగంలోకి దించనుంది. ప్రతి బూత్ కార్యకర్త లేదా మైక్రో టీమ్ కనీసం 50 కుటుంబాలను నేరుగా సంప్రదించేలా ప్రణాళిక రూపొందించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. యువత, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాలను ముమ్మరం చేయనున్నారు. ప్రత్యక్ష ప్రచారాలు, సోషల్ మీడియా సందేశాల ద్వారా బీజేపీ ప్రభుత్వ విధానాలను యువ ఓటర్లకు చేరవేసేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read..
రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో 8 మంది కూలీలు మృతి
అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు
మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.125 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

AAP MLAs join BJP | పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
నవంబర్ 2, 2026

Nitin Nabin | దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
నవంబర్ 2, 2026

Traffic Restrictions | హైదరాబాద్‌లో అమిత్‌షా పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Hyderabad Metro Phase-2 | మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.125 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
- ●Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్ బి స్ట్రాంగ్ వార్నింగ్!
- ●CBFC | సెన్సార్ రూల్స్ మరింత కఠినం - ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చిన సీబీఎఫ్సీ
- ●Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో భారీ ర్యాలీ.. గంటలోనే రూ.6 లక్షల కోట్ల లాభం.. కారణాలేమిటి..?
- ●Eight labourers died | రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో 8 మంది కూలీలు మృతి
- ●Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంటది..?

Hyderabad Metro Phase-2 | మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.125 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్ బి స్ట్రాంగ్ వార్నింగ్!

CBFC | సెన్సార్ రూల్స్ మరింత కఠినం - ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చిన సీబీఎఫ్సీ

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో భారీ ర్యాలీ.. గంటలోనే రూ.6 లక్షల కోట్ల లాభం.. కారణాలేమిటి..?



