త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం

Supreme Court | దీపావ‌ళి (Diwali) సందర్భంగా బాణసంచా విక్రయాలు, వినియోగంపై విధించిన ఆంక్షలు అమలుకాకపోవడంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఆదేశాలను ఉల్లంఘించి బాణసంచా అమ్ముతున్న వారిపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

D

National | Published On Nov 3, 2026, 2.17 pm IST

Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : దీపావ‌ళి (Diwali) సందర్భంగా బాణసంచా విక్రయాలు, వినియోగంపై విధించిన ఆంక్షలు అమలుకాకపోవడంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. టపాసుల (firecrackers) అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా బాణసంచా విక్రయాలు జ‌రుగుతుండ‌టంపై జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన‌ ధర్మాసనం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు ట‌పాసుల విక్ర‌యాల‌పై ఓ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఆదేశాలను ఉల్లంఘించి బాణసంచా అమ్ముతున్న వారిపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

లైసెన్స్‌ ఉన్నవి, లేనివి, క్యూఆర్‌ కోడ్‌ కలిగినవి, లేనివి అనే తేడా లేకుండా ఢిల్లీ మార్కెట్లలో అన్ని ర‌కాల ట‌పాసులు అందుబాటులో ఉన్నాయ‌ని స‌ద‌రు క‌థ‌నం ప్ర‌స్తావించిన‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది. ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా నోట్ చేసుకోవాల్సిందిగా అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఐశ్వ‌ర్య భాటికి జ‌స్టిస్ సుంద‌రేష్ సూచించారు. త‌మ ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ నిబంధ‌న‌లు ఉల్లంఘించి య‌థేచ్ఛ‌గా జ‌రుగుతున్న బాణ‌సంచా విక్రయాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

కాగా, దీపావళి వేళ గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చేందుకు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఇప్ప‌టికే అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో నవంబర్ 7, 8 తేదీల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చాల‌ని తెలిపింది. ఉద‌యం సాయంత్రం వేళ‌ల్లో మాత్రమే టపాసులు పేల్చాలని స్పష్టం చేసింది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. ఈ ఆంక్ష‌లు క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని న‌వంబ‌ర్ 2 విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ సుంద‌రేష్‌, బి వ‌రాలేతో కూడిన ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని ఆదేశించింది.

Also Read..

నిరసనల పేరుతో ఒకే స్థ‌లాన్ని ఆక్ర‌మించుకోలేరు : సుప్రీంకోర్టు

దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చ‌ర్య‌ల‌పై బాంబే హైకోర్టు ఆగ్ర‌హం

ఇండియ‌న్ నేవీ డేరింగ్ ఆప‌రేష‌న్‌.. స‌ముద్ర దొంగ‌ల ఆట‌క‌ట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం

ట్యాగ్స్:

Delhi MarketsDiwaliFirecrackersFirecrackers Being Sold Openly In Delhi MarketsSupreme Court
Advertisement
Advertisement