త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devireddy Sudheer Reddy | రేవంత్‌! ధ‌ర‌లు త‌గ్గించేందుకు ఏం చేస్త‌వో చెప్పు

Devireddy Sudheer Reddy | నిత్యావ‌స‌ర ధ‌ర‌లు (Prices of Essential Commodities) త‌గ్గించేందుకు ఏం చేస్తారో సీఎం రేవంత్‌రెడ్డి స‌మాధానం చెప్పాల‌ని ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (Devireddy Sudheer Reddy) ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Nov 3, 2026, 2.20 pm IST

Devireddy Sudheer Reddy | రేవంత్‌! ధ‌ర‌లు త‌గ్గించేందుకు ఏం చేస్త‌వో చెప్పు
Advertisement
  • సామాన్యుడు బ‌త‌క‌లేక‌పోతున్న‌డు
  • నీ సంగ‌తి ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయింది.. ఇగ దిగిపో
  • ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఫైర్‌

Devireddy Sudheer Reddy | త్రినేత్ర న్యూస్‌: నిత్యావ‌స‌ర ధ‌ర‌లు (Prices of Essential Commodities) త‌గ్గించేందుకు ఏం చేస్తారో సీఎం రేవంత్‌రెడ్డి స‌మాధానం చెప్పాల‌ని ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (Devireddy Sudheer Reddy) ప్ర‌శ్నించారు. పెరుగుతున్న ధ‌ర‌ల భారంతో సామాన్యుడు బ‌త‌క‌లేక‌పోతున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ‌ కిలో బియ్యం ధ‌ర రూ.110 దాటింద‌ని చెప్పారు. రాష్ట్రంలో క‌రువు రావ‌డానికి రేవంత్ మొండి వైఖ‌రే కార‌ణ‌మ‌న్నారు. మంగ‌ళ‌వారం ఎల్బీనగర్‌లో నిత్యావ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చేప‌ట్టిన‌ నిరసన కార్యక్రమం సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 

రేవంత్‌! వెంట‌నే గ‌ద్దె దిగు. ఇవాళ బియ్యం 50 రూపాయల నుంచి 110 రూపాయ‌లు అమ్ముతున్న‌రు. సామాన్యుడు బ‌త‌క‌లేక‌పోతున్న‌డు. చ‌క్కెర‌, మంచినూనె, చింత‌పండు, గుడ్లు అన్ని ధ‌ర‌లు పెరిగిన‌య్‌. ధ‌ర‌లను అదుపులోకి తెచ్చేందుకు ఏం చేస్తున్న‌రో రేవంత్ ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాలి. తాగు, సాగు నీరుకు తీవ్ర ఇబ్బందులు రాబోతున్న‌య్‌.

నీళ్లు ఎత్తిపోసుకో..

కాళేశ్వ‌రం నుంచి నీళ్ల‌ను ఎత్తిపోసుకోమంటే ఎత్తుత‌లేడు. ఎందుకంటే గ‌తంలో రేవంత్ చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలు అని తేలుత‌య్‌. ప్ర‌జ‌ల ముందట ప‌డిపోతా.. కేసీఆర్ గొప్పోళ్ల‌వుత‌ర‌ని అనుకుంటుండు. రాష్ట్రాన్ని అయినా ఎండ‌బెడ‌తా కానీ కాళేశ్వ‌రం నుంచి నీళ్లు తీసుకోను అనే క‌క్ష్య సాధింపులు చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్న‌డు. ఎల్‌నినో ప్ర‌భావం ఉన్నా గానీ నీళ్లు ఎత్తిపోసి చెరువులు నింపితే 80 శాతం క‌రువు దూర‌మైతుండే.

అబ‌ద్ద‌మే రేవంత్ గుండె ధైర్యం

రేవంత్ మొండివైఖ‌రితోని వ‌చ్చిన క‌రువే ఇది. రైతాంగం అంతా రివ‌ర్స్ అయితున్న‌రు. అందుకే తుమ్మిడిహెట్టిని తెర మీదికి తెచ్చిండు. మ‌హారాష్ట్ర వాళ్లు చూద్దాం అని చెప్తేనే వీళ్లు సంబ‌రాలు చేసుకుంటున్న‌రు. మియాపూర్ భూముల మీద కూడా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్న‌రు. ఎట్ల‌యినా స‌రే కేసీఆర్ కుటుంబాన్ని బ‌ద‌నాం చేయాల‌ని కుట్ర‌లు చేస్తరు. అబ‌ద్ద‌మే రేవంత్ గుండె ధైర్యం. ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయింది. నిన్ను గ‌ద్దె దిగేది ఖాయం. క‌రువు మీద అవ‌గాహ‌న‌ను తీసుకొచ్చే బాధ్య‌త‌ను బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు తీసుకున్న‌రు అని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

అంత‌కుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ చేప‌ట్టిన నిర‌స‌న‌లో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

 

ట్యాగ్స్:

Devireddy Sudheer ReddyEl NinoHydLB NagarPrices Of Essential CommoditiesProtestTelangana
Advertisement
Advertisement