త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | వాట్సాప్ గ్రూప్‌లలో 4 కొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్ మరింత ఈజీ..

WhatsApp | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గ్రూప్ చాట్‌ల కోసం నాలుగు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమైన సందేశాలను ఎప్పటికీ పిన్ చేసుకోవడం, గ్రూపులో కొత్తగా చేరిన వారికి పాత సందేశాలను షేర్ చేయడం, గ్రూప్ స్టేటస్ అప్‌డేట్స్, చదవని సందేశాలను ప్రత్యేకంగా గుర్తించే సదుపాయాలను ప్రవేశపెట్టింది. వీటితో గ్రూప్ సంభాషణలను నిర్వహించడం మరింత సులభం కానుంది.

S

Technology | Published On Nov 3, 2026, 2.12 pm IST

WhatsApp | వాట్సాప్ గ్రూప్‌లలో 4 కొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్ మరింత ఈజీ..
Advertisement

WhatsApp | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గ్రూప్ చాట్‌ల కోసం నాలుగు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమైన సందేశాలను ఎప్పటికీ పిన్ చేసుకోవడం, గ్రూపులో కొత్తగా చేరిన వారికి పాత సందేశాలను షేర్ చేయడం, గ్రూప్ స్టేటస్ అప్‌డేట్స్, చదవని సందేశాలను ప్రత్యేకంగా గుర్తించే సదుపాయాలను ప్రవేశపెట్టింది. వీటితో గ్రూప్ సంభాషణలను నిర్వహించడం మరింత సులభం కానుంది.

మెసేజ్‌ల‌ను నిర‌వ‌ధికంగా పిన్ చేసుకోవ‌చ్చు..

గ్రూప్ చాట్‌ల వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో వాట్సాప్ నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఇందులో మొదటిది మెసేజ్‌లను నిరవధికంగా పిన్ చేసుకునే సదుపాయం. గతంలో పిన్ చేసిన సందేశాలకు ముందుగానే సమయ పరిమితిని ఎంచుకోవాల్సి ఉండేది. తాజా అప్‌డేట్‌తో ఎలాంటి గడువు లేకుండా ముఖ్యమైన సందేశాలను పిన్ చేసుకోవచ్చు. రెండో ఫీచర్ ద్వారా గ్రూపులో కొత్తగా చేరిన సభ్యులకు గత సంభాషణలను షేర్ చేయవచ్చు. గతంలో కొత్త సభ్యులను చేర్చే సమయంలోనే ఇటీవల సందేశాలను పంపే అవకాశం ఉండగా, ఇప్పుడు వారు గ్రూపులో చేరిన తర్వాత కూడా వారి పేరుపై క్లిక్ చేసి పాత సందేశాలను షేర్ చేయవచ్చు. ఈ సందేశాలకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుంది.

గ్రూప్ స్టేట‌స్ అప్‌డేట్స్‌..

మూడో ఫీచర్ గ్రూప్ స్టేటస్ అప్‌డేట్స్. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా రన్నింగ్ క్లబ్ వంటి నిర్దిష్ట గ్రూపులకు ప్రత్యేకంగా స్టేటస్‌లను షేర్ చేయవచ్చు. గ్రూపులోని సభ్యులంతా వాటిని చూడడంతోపాటు స్పందించవచ్చు. అలాగే తమ స్టేటస్‌లను కూడా పోస్ట్ చేయవచ్చు. సాధారణ స్టేటస్‌ల మాదిరిగానే ఇవి 24 గంటల తర్వాత అదృశ్యమవుతాయి. నాలుగో ఫీచర్ ద్వారా చదవని గ్రూప్ చాట్‌లను ప్రత్యేకంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా తమను ప్రస్తావించిన సందేశాలు, నేరుగా సమాధానం ఇచ్చిన సందేశాలు, గ్రూపులో అందరినీ ఉద్దేశించి పంపిన ఎట్ ఆల్ సందేశాలను సులభంగా గుర్తించవచ్చు.

ఇప్పటికే వాట్సాప్ గ్రూప్‌లలో వ్యక్తిగత సభ్యులకు ప్రైవేట్‌గా రిప్లై ఇవ్వడం, పోల్స్‌లో ఒకే సమాధానాన్ని ఎంచుకునేలా పరిమితి విధించడం, గ్రూప్ సభ్యులు తమ పాత్రలు లేదా సంబంధాలను గుర్తించేలా మెంబర్ ట్యాగ్‌లను ఉపయోగించడం వంటి సదుపాయాలు ఉన్నాయి. ఉదాహరణకు సామ్ తండ్రి, ట్రెజరర్ వంటి ట్యాగ్‌లను పెట్టుకోవచ్చు. తాజాగా ప్రకటించిన నాలుగు ఫీచర్లు యాప్ అప్‌డేట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటి పూర్తి విడుదలకు సంబంధించి వాట్సాప్ ఇంకా నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించలేదు.

ట్యాగ్స్:

Message PinningWhatsappWhatsApp Group ChatsWhatsApp New FeaturesWhatsApp Status
Advertisement
Advertisement