Bombay High Court | దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చర్యలపై బాంబే హైకోర్టు ఆగ్రహం
Bombay High Court | ప్రముఖ నటి దియా మీర్జా (Dia Mirza ) దీపావళి వీడియోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తొలగించడం పట్ల బాంబే హైకోర్టు (Bombay High Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పౌరుల్లో రాజ్యాంగ విలువలు, వ్యవస్థలపై నమ్మకాన్ని పెపొందించడానికి తొలగించిన ప్రచార వీడియోను మళ్లీ పునరుద్ధరించడం సరైన చర్య అని అభిప్రాయపడింది.
Bombay High Court | త్రినేత్ర న్యూస్ : కాలుష్య రహిత దీపావళి ప్రచారంలో (pollution-free Diwali campaign video) భాగంగా నటి దియా మీర్జా (Dia Mirza) భాగస్వామ్యంతో రూపొందించిన వీడియోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తొలగించడం పట్ల బాంబే హైకోర్టు (Bombay High Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు బీఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ఒత్తిళ్లు, విమర్శల కారణంగా ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంపొందించే ఇలాంటి సామాజిక ప్రచార వీడియోలను తొలగించడం పట్ల జస్టిస్ గిరీష్ కుల్కర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ సంద్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "బీఎంసీ చేపట్టిన ప్రజా అవగాహన ప్రచారంలో పాల్గొన్న, మద్దతు తెలిపిన ప్రముఖులపై కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు మాకు తీవ్ర ఆందోళన కలిగించాయి" అని వ్యాఖ్యానించింది. కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఎంసీ చేపట్టిన చర్యలను సమర్థించిన ధర్మాసనం.. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ వర్గపోరకు తావులేదని స్పష్టం చేసింది.
ముంబై నగరం విభిన్న సంస్కృతులు, ఐక్యతతో కూడిన జీవన విధానాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు, చర్యల వల్ల ఈ సామాజిక సమతుల్యత దెబ్బతినడానికి ఏమాత్రం వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. పౌరుల్లో రాజ్యాంగ విలువలు, వ్యవస్థలపై నమ్మకాన్ని పెపొందించడానికి తొలగించిన ప్రచార వీడియోను మళ్లీ పునరుద్ధరించడం సరైన చర్య అని అభిప్రాయపడింది. అయితే, దీనిపై తుది నిర్ణయాన్ని మాత్రం బీఎంసీ విచక్షణకే వదిలేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
కాగా, వాయు, శబ్దకాలుష్యాలు లేకుండా పర్యావరణహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. నటి దియా మీర్జాతోపాటూ మాధురి దీక్షిత్, నిశిగంధ వాడ్, క్రికెటర్ అజింక్య రహానే వంటి ప్రముఖులతో ప్రచార వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే, దియా మీర్జా వీడియోపై బీజేపీ ముంబై చీఫ్ అమిత్ సత్నామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపావళిని ఎలా జరుపుకోవాలో దియా మీర్జా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఈ పండుగ తమ సంస్కృతిలో భాగమని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. అమిత్ సత్నామ్ విమర్శలతో దియా మీర్జా వీడియోను బీఎంసీ సోషల్ మీడియా నుంచి తొలగించింది. అజింక్య రహానే, మాధురీ దీక్షిత్ పోస్ట్‌లను మాత్రం అలాగే ఉంచింది. దీంతో దీనిపై వివాదం చెలరేగింది.
Also Read..
తలకు ధరించే సరికొత్త వేరబుల్ డివైస్.. భారత్‌లో అమ్మకాలు షురూ.. ఏంటిది, ఎలా పనిచేస్తుంది..?
ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్.. సముద్ర దొంగల ఆటకట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్షమాపణలు..!
నవంబర్ 2, 2026

Dia Mirza | దియా మీర్జా దీపావళి యాడ్‌పై బీజేపీ నేతల అభ్యంతరం – డిలీట్ చేసిన బీఎంసీ
నవంబర్ 2, 2026

Imran Khan Bombay High Court | భారత్ వీడి వెళ్లాలంటూ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. అక్టోబర్ 26న బాంబే హైకోర్టు విచారణ
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Temple Wearable | తలకు ధరించే సరికొత్త వేరబుల్ డివైస్.. భారత్‌లో అమ్మకాలు షురూ.. ఏంటిది, ఎలా పనిచేస్తుంది..?
- ●Indian Navy | ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్.. సముద్ర దొంగల ఆటకట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం
- ●Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి
- ●Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?
- ●Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?

Temple Wearable | తలకు ధరించే సరికొత్త వేరబుల్ డివైస్.. భారత్‌లో అమ్మకాలు షురూ.. ఏంటిది, ఎలా పనిచేస్తుంది..?

Indian Navy | ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్.. సముద్ర దొంగల ఆటకట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం

Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి

Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?



