TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..
TRAI | టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక సంస్కరణలు ప్రకటించింది. 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫిర్యాదుల పరిష్కార నిబంధనలను కఠినతరం చేసింది. తప్పుడు ఫిర్యాదు పరిష్కారాలకు రూ.1వేయి, అప్పీళ్లను సక్రమంగా పరిష్కరించకపోతే రూ.5వేలు జరిమానా విధించనుంది. అలాగే 24 గంటల పాటు కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
TRAI | టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక సంస్కరణలు ప్రకటించింది. 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫిర్యాదుల పరిష్కార నిబంధనలను కఠినతరం చేసింది. తప్పుడు ఫిర్యాదు పరిష్కారాలకు రూ.1వేయి, అప్పీళ్లను సక్రమంగా పరిష్కరించకపోతే రూ.5వేలు జరిమానా విధించనుంది. అలాగే 24 గంటల పాటు కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
గరిష్టంగా రూ.20 లక్షలు..
టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక నిబంధనలు ప్రకటించింది. టెలికాం కన్జ్యూమర్స్ కంప్లైంట్ రీడ్రెస్సల్ (ఫోర్త్ అమెండ్‌మెంట్) రెగ్యులేషన్స్, 2026 ప్రకారం ఫిర్యాదులను తప్పుగా పరిష్కరించినట్లు చూపించే టెలికాం సంస్థలకు ఒక్కో ఫిర్యాదుపై రూ.1వేయి, అప్పీళ్లను సక్రమంగా పరిష్కరించకపోతే ఒక్కో అప్పీల్‌కు రూ.5వేలు జరిమానా విధించనుంది. ఒక్కో లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియా (ఎల్ఎస్ఏ) పరిధిలో త్రైమాసికానికి ఈ జరిమానాల గరిష్ఠ పరిమితి రూ.20 లక్షలుగా నిర్ణయించింది. టెలికాం సంస్థలపై వినియోగదారుల ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో 44,733గా ఉన్న ప్రత్యక్ష ఫిర్యాదులు 2026 ఆర్థిక సంవత్సరంలో 63 శాతం పెరిగి 73,081కు చేరాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 55,978గా నమోదైంది.
రోజుకు 24 గంటలూ పనిచేయాల్సిందే..
కొత్త నిబంధనల ప్రకారం టెలికాం సంస్థల ఫిర్యాదుల కేంద్రాలు వారంలో ఏడు రోజులు, రోజుకు 24 గంటలు పనిచేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న 16 గంటల సేవల పరిమితిని తొలగించింది. వినియోగదారులకు కనీసం 16 గంటల పాటు మానవ ప్రతినిధుల సహాయం అందుబాటులో ఉండాలి. మిగిలిన సమయంలో కృత్రిమ మేధ (ఏఐ) ఏజెంట్లు, చాట్‌బాట్‌లు, ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా సేవలు అందించవచ్చు. అయితే వీటిపై తగిన మానవ పర్యవేక్షణ తప్పనిసరి. వినియోగదారులు ఏఐ ఏజెంట్ లేదా చాట్‌బాట్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయాలి. ఐవీఆర్‌ఎస్, మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్స్‌కు మూడు స్థాయిలతో కూడిన ప్రామాణిక వ్యవస్థను కూడా ట్రాయ్ నిర్దేశించింది. ఐవీఆర్‌ఎస్ సేవలు ఇంగ్లిష్, హిందీతో పాటు సంబంధిత లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియా పరిధిలోని రాష్ట్రాల అధికారిక భాషల్లో కనీసం మరో భాషలో అందుబాటులో ఉండాలి. ఫిర్యాదు పరిష్కారంపై అప్పీల్ చేసుకునే గడువును గతంలో ఉన్న 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది. అప్పీల్ అందిన 15 రోజుల్లోగా సంస్థల అప్పీలేట్ అథారిటీ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న మూడు రోజుల్లో వినియోగదారులకు తెలియజేయాలి. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ నిబంధనల్లో నిర్దిష్ట గడువు లేని ఫిర్యాదులు, సేవా అభ్యర్థనలను మూడు రోజుల్లో పరిష్కరించాలి.
నివేదికలను ఆలస్యంగా సమర్పించినా ఫైన్..
అలాగే త్రైమాసిక పనితీరు నివేదికలను ఆలస్యంగా సమర్పించే టెలికాం సంస్థలపైనా జరిమానాలు విధించనుంది. తొలి 15 రోజుల ఆలస్యానికి రోజుకు గరిష్ఠంగా రూ.5వేలు, ఆ తర్వాత రోజుకు రూ.20వేల వరకు జరిమానా విధించనుంది. ఒక్కో సందర్భంలో, ఒక్కో ఎల్ఎస్ఏకు జరిమానా గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షలుగా నిర్ణయించింది. జరిమానా విధించిన ఆదేశం వెలువడిన 21 రోజుల్లోగా సంస్థలు చెల్లించాలి. గడువులోగా చెల్లించకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) కంటే రెండు శాతం అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 2012లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫిర్యాదుల పరిష్కార నిబంధనలకు తాజా మార్పులు వర్తించనున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్లు, చాట్‌బాట్‌లు వంటి డిజిటల్ మార్గాలను ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో మే నెలలో ముసాయిదా ప్రతిపాదనలు విడుదల చేసిన ట్రాయ్.. ఇప్పుడు తుది సంస్కరణలను ప్రకటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు
- ●Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- ●Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి "కాకా" విలన్ - వారెంట్ జారీ చేసిన కోర్టు
- ●WhatsApp | వాట్సాప్ గ్రూప్‌లలో 4 కొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్ మరింత ఈజీ..
- ●Supreme Court | నిరసనల పేరుతో ఒకే స్థలాన్ని ఆక్రమించుకోలేరు : సుప్రీంకోర్టు
- ●LG India | ఎల్జీ టీవీలు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. 170కి పైగా ఫ్రీ చానల్స్..

Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు

Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి "కాకా" విలన్ - వారెంట్ జారీ చేసిన కోర్టు

WhatsApp | వాట్సాప్ గ్రూప్‌లలో 4 కొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్ మరింత ఈజీ..






