త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | నాతో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ .. మోదీకి అంత‌సీన్ లేదు : రాహుల్ గాంధీ

Rahul Gandhi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధాని త‌న ఫోన్‌ను ట్యాప్ (Phone Tapping) చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా ఎప్పుడైనా, ఎక్క‌డైనా ప్ర‌ధానితో బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని రాహుల్ మ‌రోసారి స‌వాల్ విసిరారు ( challenge for a one-on-one debate).

D

National | Published On Nov 13, 2026, 2.50 pm IST

Rahul Gandhi | నాతో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ .. మోదీకి అంత‌సీన్ లేదు : రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధాని త‌న ఫోన్‌ను ట్యాప్ (Phone Tapping) చేస్తున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలు అందులోనే ఉన్నాయ‌ని రాహుల్ చెప్పారు. త‌న ఫోన్‌లో ఆధారాలు ఉన్న విష‌యం ప్ర‌ధానికి కూడా తెలుసున‌ని, అందుకే చ‌ర్చ‌కు రావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వ‌హించిన ఆస్క్ మీ ఎనీథింగ్ సెష‌న్‌లో ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎప్పుడైనా, ఎక్క‌డైనా ప్ర‌ధానితో బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని రాహుల్ మ‌రోసారి స‌వాల్ విసిరారు ( challenge for a one-on-one debate). తనతో ప్రత్యక్ష చర్చలో పాల్గొంటే ప్రధాని ఆ పదవిలో కొనసాగలేరని వ్యాఖ్యానించారు. ఆ చర్చ జరిగితే ఎవరు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారో, ఎవరు దేశ వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుస్తుందని స్ప‌ష్టం చేశారు. "మోదీ విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారు. నా ఫోన్‌లో అన్ని ఆధారాలున్నాయి. నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు. ఈ విష‌యం ప్ర‌ధానికి కూడా తెలుసు అందుకే చ‌ర్చ‌కు రావ‌డం లేదు. ముఖాముఖి చ‌ర్చ‌కు వ‌స్తే ఎవ‌రు దేశ వ్య‌తిరేకులో బ‌య‌ట‌ప‌డుతుంది" అని రాహుల్ స‌వాల్ విసిరారు.

"వ్యవసాయ చట్టాలు, ఓట్ల చోరీ, చైనా, న‌వేరా బుక్ వివాదం, ఎప్‌స్టీన్ అంశాలపై నన్ను మాట్లాడనీయడంలేదు. నాకు ముఖాముఖి చర్చ కావాలి. సుదీర్ఘ ప్రసంగాలతో కూడిన చర్చ నాకు వద్దు. ఈ చ‌ర్చ‌కు గౌత‌మ్ అదానీ లేదా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ న్యాయ‌మూర్తులుగా వ్య‌వ‌హరించినా నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. అయితే, ఈ ముఖాముఖి చ‌ర్చ త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విలో మోదీ ఉండ‌లేర‌ని నేను గ్యారెంటీ ఇస్తున్నాను" అని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

Also Read..

భార‌త్ చొర‌వ‌తోనే యోగాకు ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు : ప్రధాని మోదీ

శాంతి భ‌ద్ర‌త‌లు, మ‌హిళా భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ స‌మ‌స్య‌కు ప్రాధాన్య‌త ఇస్తాం : సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైద‌రాబాద్ భ‌క్తుడి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే!

Advertisement
Advertisement