Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
Minister Seethakka | గ్రామీణ పేదల ఉపాధి హక్కును బలహీనపరిచే విధంగా వీబీజీ రామ్‌జీ చట్టం (VB GRAM G) ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉపసంహరించుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను యథాతథంగా కొనసాగించాలని ఆమె కోరారు.
Minister Seethakka | గ్రామీణ పేదల ఉపాధి హక్కును బలహీనపరిచే విధంగా వీబీజీ రామ్‌జీ చట్టం (VB GRAM G) ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉపసంహరించుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను యథాతథంగా కొనసాగించాలని ఆమె కోరారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క మూడు వేర్వేరు లేఖలు రాశారు. నూతన చట్టం నిబంధనలు పేదలు, దళితులు, ఆదివాసీలు, భూమిలేని గ్రామీణ కుటుంబాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆమె లేఖల్లో పేర్కొన్నారు.
నిధుల కేటాయింపును రాష్ట్ర స్థాయిలో నిర్ణయించడం వల్ల గ్రామ పంచాయతీల వాస్తవ ఉపాధి అవసరాలు దెబ్బతింటున్నాయని సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్ వంటి వెనుకబడిన జిల్లాల్లో అధిక ఉపాధి అవసరాలు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించడం అన్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీల గత ఐదేళ్ల పనిదినాల ఆధారంగా నిధుల కేటాయింపుకు 80 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్థిక సంఘ ప్రమాణాలకు 20 శాతం మాత్రమే వెయిటేజీ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అలాగే కేంద్రం అధికారం అధికంగా కలిగి ఉండే నిబంధనలను సవరించాలని కూడా కోరింది.
ఇందిరమ్మ ఇళ్ల వంటి గృహ నిర్మాణ పథకాలను కొత్త చట్ట పరిధిలోకి తీసుకురావాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. 90 రోజుల ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వల్ల పేద కుటుంబాలు నష్టపోతాయని ఆమె హెచ్చరించారు. వ్యవసాయ అనుబంధ పనులు, భూమి అభివృద్ధి, వరద ప్రభావిత భూముల పునరుద్ధరణ, పశుగ్రాస అభివృద్ధి వంటి జీవనోపాధి పనులకు అనుమతి ఇవ్వాలని ఆమె సూచించారు. అలాగే ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామ నిబంధనను పూర్తిగా ఉపసంహరించాలన్నారు. అడవులు, మొక్కల పెంపకం వంటి పనులు వర్షాకాలంలోనే ఎక్కువగా జరుగుతాయని, ఆ సమయంలో ఉపాధి నిలిపివేయడం అనర్థకమని సీతక్క పేర్కొన్నారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కు, పంచాయతీ అధికారాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి





