Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు
Amit Shah | దేశ భద్రతా విధానంలో గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల కిందట దేశంలో ఉగ్రదాడులు వరుసగా చోటుచేసుకున్నా, అప్పటి ప్రభుత్వం ధీటుగా స్పందించలేదని షా ఆరోపించారు.
Amit Shah | దేశ భద్రతా విధానంలో గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల కిందట దేశంలో ఉగ్రదాడులు వరుసగా చోటుచేసుకున్నా, అప్పటి ప్రభుత్వం ధీటుగా స్పందించలేదని షా ఆరోపించారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం పాటించారని, ఉగ్రవాదంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతా విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.
ఉరి, పుల్వామా, పహల్గాం వంటి ఘటనల సమయంలో భారత్ స్పందించిన తీరు గతానికి భిన్నమన్నారు. ఉరి దాడి అనంతరం భారత సైన్యం సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్‌లో వైమానిక దాడులు నిర్వహించడం వంటి చర్యలను ఆయన గుర్తు చేశారు. పహల్గాం ఘటనకు ప్రతిస్పందనగా చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా కూడా ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పామని తెలిపారు. భారత్ ఇప్పుడు ఉగ్రదాడులపై మౌనంగా ఉండే దేశం కాదని, అవసరమైతే శత్రు భూభాగంలోకి వెళ్లి చర్యలు తీసుకునే సామర్థ్యం సాధించిందని అమిత్ షా అన్నారు. అలాగే, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైందని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఆయుధాల కోసం కూడా విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు భారత్ స్వదేశీ క్షిపణులు తయారు చేస్తూ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించిందని తెలిపారు.
సంబంధిత వార్తలు

Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
జూన్ 20, 2026

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జూన్ 20, 2026

Consumer Court | ఎనిమిదేళ్లు వర్క్‌షాప్‌లోనే కారు.. రూ.11లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన వినియోగదారుల కమిషన్..
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి
- ●Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ - నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్
- ●VC Sajjanar | మొహర్రం సందర్భంగా బీబీ కా అలవాలో ఏనుగు 'శ్రీదేవి' ట్రయల్ రన్ షురూ!
- ●Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
- ●Ponnam Prabhakar | ఇబ్బందులుండొద్దు.. పనితీరు మంచిగుండాలే
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు

Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి

Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ - నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్

VC Sajjanar | మొహర్రం సందర్భంగా బీబీ కా అలవాలో ఏనుగు 'శ్రీదేవి' ట్రయల్ రన్ షురూ!

Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ



