త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Roof Collapses At Temple | ఆల‌యంలో కూలిన పైక‌ప్పు.. ప‌లువురు మృతి..!

Roof Collapses At Temple | మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌ర్భ‌ణీ జిల్లా (Parbhani district)లోని మన్వత్ తహసీల్‌లో గ‌ల‌ ప్రసిద్ధ య‌శ్వాడి మారుతి దేవాల‌యంలో (Yashwadi Maruti Temple) నిర్మాణంలో ఉన్న స‌భా మంట‌పం (Roof Collapses At Temple) ఒక్క‌సారిగా కూలిపోయింది.

D

National | Published On Jun 20, 2026, 5.26 pm IST

Roof Collapses At Temple | ఆల‌యంలో కూలిన పైక‌ప్పు.. ప‌లువురు మృతి..!
Advertisement

Roof Collapses At Temple | మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌ర్భ‌ణీ జిల్లా (Parbhani district)లోని మన్వత్ తహసీల్‌లో గ‌ల‌ ప్రసిద్ధ య‌శ్వాడి మారుతి దేవాల‌యంలో (Yashwadi Maruti Temple) నిర్మాణంలో ఉన్న స‌భా మంట‌పం (Roof Collapses At Temple) ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మంది భ‌క్తులు (pilgrims) శిథిలాల కింద చిక్కుకుపోయిన‌ట్లు తెలుస్తోంది.

శ‌నివారం కావ‌డంతో హ‌నుమాన్ ద‌ర్శ‌నం కోసం ఉద‌యం నుంచే ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుండ‌గా.. నిర్మాణంలో ఉన్న స‌భా మంట‌పానికి సంబంధించిన పైక‌ప్పు, ఒక పిల్ల‌ర్ అక‌స్మాత్తుగా కూలి భ‌క్తుల‌పై ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. అనేక మంది గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న సహాయక బృందాలు, స్థానిక అధికారులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ప‌ర్భ‌ణీ జిల్లా సివిల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని ర‌క్షించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read..

ఏంజెలినా జోలీ సినిమాలో విల‌న్‌గా వార‌ణాసి హీరోయిన్ - హాలీవుడ్‌లో క్రేజీ ఛాన్స్‌

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధ‌ర ఎంతంటే..?

ఎనిమిదేళ్లు వ‌ర్క్‌షాప్‌లోనే కారు.. రూ.11ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశించిన వినియోగ‌దారుల క‌మిష‌న్‌..

Advertisement
Advertisement