JD Vance | పాకిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛ లేదు.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
JD Vance | పాకిస్థాన్‌లో అమెరికా తరహా పత్రికా స్వేచ్ఛ లేదని (Pakistans press freedom) అధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా ఇరాన్‌తో ఒప్పంద వివరాలు విడుదల చేసే విషయంలో కొంత ఆలస్యం జరిగినట్లు చెప్పారు.
International | Published On Jun 20, 2026, 4.49 pm IST
JD Vance | అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో అమెరికా తరహా పత్రికా స్వేచ్ఛ లేదని (Pakistans press freedom) వ్యాఖ్యానించారు. అందుకే ఇరాన్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (MoU) వివరాల వెల్లడిలో ఆలస్యం జరిగిందని చెప్పారు. జూన్ 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రెండు రోజుల తర్వాత ఈ ఒప్పందం అధికారిక పత్రం విడుదలైంది.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వాన్స్.. ఆ వివరాలను ముందే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే, పాకిస్థాన్, ఖతార్ (Qatar)లో పత్రికా స్వేచ్ఛ సరిగ్గా లేకపోవడం కారణంగా ఇరాన్‌తో ఒప్పంద వివరాలు విడుదల చేసే విషయంలో కొంత ఆలస్యం జరిగినట్లు చెప్పారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛకు భంగం కలిగించే చట్టాలను ప్రభుత్వం అమలు చేయడాన్ని అమెరికా రాజ్యాంగం నిషేధిస్తుందని ఈ సందర్భంగా జేడీ వాన్స్ వెల్లడించారు. అమెరికా-ఇరాన్ డీల్‌కు పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, పాకిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛ తీవ్రమైన ఆంక్షలు, బెదిరింపులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో పాకిస్థాన్ 180 దేశాల్లో 153వ స్థానంలో ఉంది. అక్కడ జర్నలిస్టుల స్వేచ్ఛపై అంతర్జాతీయ సంస్థలు గతంలోనూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA), ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ (PECA) వంటి చట్టాలను అడ్డుపెట్టుకుని అక్కడి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. జర్నలిస్టులపై భౌతిక దాడులు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, హత్యలు తరచూ జరుగుతుంటాయి. పాత్రికేయులకు తగిన రక్షణ లేకపోగా నేరస్థులకు శిక్ష పడటం చాలా అరుదు.
Also Read..
బీజేపీ గాడ్సే జపం చేస్తోంది.. అందుకే వ్యూహాలు పన్నుతున్నరు
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ రెడీ.. 22న ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్..
సంబంధిత వార్తలు

Air Force One | అమెరికా అధ్యక్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖతార్
జూన్ 20, 2026

US Iran Peace Deal | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం: ఆ 14 పాయింట్ల ఫ్రేమ్‌వర్క్‌లో ఏముంది?
జూన్ 15, 2026

Donald Trump | ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది.. హర్మూజ్ తెరుచుకుంది: డొనాల్డ్ ట్రంప్
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Priyanka Chopra | ఏంజెలినా జోలీ సినిమాలో విలన్‌గా వారణాసి హీరోయిన్ - హాలీవుడ్లో క్రేజీ ఛాన్స్
- ●Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధర ఎంతంటే..?
- ●Consumer Court | ఎనిమిదేళ్లు వర్క్‌షాప్‌లోనే కారు.. రూ.11లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన వినియోగదారుల కమిషన్..
- ●Balmoori Venkat | తేజస్వీ సూర్యను తెలంగాణకు రానివ్వం.. వస్తే మా ఆవేశం చూపిస్తం
- ●BRS Press Meet | ప్రతి గింజ కొంటాం అని చేతులెత్తేశారు.. తెలంగాణను కరవు కోరల్లోకి నెట్టిన రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్ ఫైర్
- ●Virat Kohli | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ రెడీ.. 22న ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్..

Priyanka Chopra | ఏంజెలినా జోలీ సినిమాలో విలన్‌గా వారణాసి హీరోయిన్ - హాలీవుడ్లో క్రేజీ ఛాన్స్

Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధర ఎంతంటే..?

Consumer Court | ఎనిమిదేళ్లు వర్క్‌షాప్‌లోనే కారు.. రూ.11లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన వినియోగదారుల కమిషన్..

Balmoori Venkat | తేజస్వీ సూర్యను తెలంగాణకు రానివ్వం.. వస్తే మా ఆవేశం చూపిస్తం



