Priyanka Chopra | ఏంజెలినా జోలీ సినిమాలో విలన్‌గా వారణాసి హీరోయిన్ – హాలీవుడ్‌లో క్రేజీ ఛాన్స్
హాలీవుడ్‌లో మరో క్రేజీ సినిమాకు ప్రియాంక చోప్రా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏంజెలినా జోలీతో కలిసి ఓ సినిమా చేయబోతుంది. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ హాలీవుడ్ మూవీలో ప్రియాంక చోప్రా విలన్‌గా నటిస్తోన్నట్లు సమాచారం.
Entertainment | Published On Jun 20, 2026, 5.22 pm IST
Priyanka Chopra | హాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బిజీ అవుతోంది. క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇటీవల రిలీజైన ది బ్లఫ్ మూవీలో యాక్షన్ రోల్‌లో ప్రియాంక అదరగొట్టింది. ప్రస్తుతం లార్గ్ ఆఫ్ రింగ్స్ ఫేమ్ అర్లాంబో బ్లూమ్స్‌తో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. వీటితో పాటు ప్రియాంక చేస్తోన్న మరో రెండు హాలీవుడ్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
లక్కీ ఛాన్స్...
తాజాగా గ్లోబల్ స్టార్ హాలీవుడ్‌లో మరో లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఏంజెలినా జోలీతో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతుంది. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా అఫీషియల్‌గా ఓ ఇంటర్వ్యూలో కన్ఫామ్ చేసింది. హాలీవుడ్ సినిమాలు చేయడానికి ఒక రకంగా తనకు ఏంజెలినా జోలీ స్ఫూర్తి అని, ఆమెతో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకునే అవకాశం దక్కిందంటే నమ్మలేకపోతున్నానంటూ చెప్పింది. ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టే క్షణాల కోసం ఎదురుచూస్తున్నానంటూ తెలిపింది.
విలన్‌గా...
సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ఏంజెలినా జోలీ హీరోయిన్‌గా నటిస్తోండగా...ప్రియాంక చోప్రా క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని అంటున్నారు. గ్లామరస్ విలన్‌గా ఈ ఇండియన్ బ్యూటీ కనిపిస్తుందని సమాచారం. గ్లామర్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లో ఏంజెలినా జోలీకి ధీటుగా ప్రియాంక పాత్ర ఉంటుందని చెబుతున్నారు.
మహేష్ బాబు వారణాసి...
ప్రస్తుతం తెలుగులో ప్రియాంక చోప్రా వారణాసి సినిమా చేస్తోంది. మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలో మందాకినిగా కనిపించబోతుంది. ప్రియాంక చోప్రా చేస్తోన్న ఫస్ట్ తెలుగు మూవీ ఇదే. అంతే కాకుండా ఈ సినిమాతోనే దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఇండియన్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. వారణాసి కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Obsession Review | అబ్సెషన్ రివ్యూ – ఏడు కోట్ల బడ్జెట్ – 1900 కోట్ల కలెక్షన్స్ – హాలీవుడ్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
జూన్ 11, 2026

Priyanka Chopra | పాకిస్థానీ దిగ్గజ నటి పాత్రలో ప్రియాంక చోప్రా.. ఫస్ట్ ఐటెమ్ గర్ల్‌గా గ్లోబల్ స్టార్
మే 14, 2026

Priyanka Chopra | దళపతి విజయ్ క్రేజ్ అప్పుడే తెలిసింది – డెబ్యూ మూవీ అనుభవాలపై ప్రియాంక చోప్రా కామెంట్స్
మే 11, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు
- ●RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు
- ●Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- ●Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్
- ●Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ●Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!

Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు

RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్



