త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Truck rams car | షాకింగ్‌.. కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్ర‌క్కు

Truck rams car | ఒడిశా (Odisha) భువ‌నేశ్వ‌ర్ (Bhubaneswar)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌లాసుని వంతెన (Palasuni Bridge)పై ఓ కారును ట్ర‌క్కు ఢీ కొట్టింది (Truck rams car). అనంత‌రం దాన్ని అలాగే కొంత‌దూరం ఈడ్చుకెళ్లింది.

D

National | Published On May 30, 2026, 1.18 pm IST

Truck rams car | షాకింగ్‌.. కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్ర‌క్కు
Advertisement

Truck rams car | ఒడిశా (Odisha) భువ‌నేశ్వ‌ర్ (Bhubaneswar)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఓ కారును ట్ర‌క్కు ఢీ కొట్టింది (Truck rams car). అనంత‌రం దాన్ని అలాగే కొంత‌దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌తో కారులోని తండ్రీ, కూతురు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌హాయం కోసం కేక‌లు వేశారు. అయినా ట్ర‌క్కు డ్రైవ‌ర్ వాహ‌నాన్ని ఆప‌కుండానే ముందుకు పోనిచ్చాడు.

భువ‌నేశ్వ‌ర్‌లోని ప‌లాసుని వంతెన (Palasuni Bridge)పై శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి త‌న కుమార్తెతో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్నాడు. వంతెన దాటుతున్న స‌మ‌యంలో వెనుక నుంచి అతివేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు కారును బ‌లంగా ఢీ కొట్టింది. అనంత‌రం కారును అలాగే ముందుకు తోసుకుంటూ ఈడ్చుకెళ్లింది. దాదాపు 500 మీట‌ర్ల వ‌ర‌కూ అలాగే వెళ్లింది. ఆ త‌ర్వాత కారును త‌ప్పించుకుని ట్ర‌క్కు ఆప‌కుండా వేగంగా ముందుకు వెళ్లిపోయింది. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ ఈ ఘ‌ట‌న నుంచి తండ్రీకూతురు తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌మాదానికి సంబంధించిన దృశ్యాల‌ను అటుగా వెళ్తున్న వాహ‌న‌దారులు త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో అదికాస్తా వైర‌ల్‌గా మారింది.

స‌మాచారం అందుకున్న‌ మంచేశ్వర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప‌రిస్థితిని ప‌రిశీలించారు. తండ్రీ, కూతుర్ని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌రోవైపు వీడియో ఆధారంగా ట్ర‌క్కును ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ప‌హాలా స‌మీపంలో ఆ ట్ర‌క్కును గుర్తించి అడ్డుకున్నారు. డ్రైవ‌ర్‌ను అరెస్ట్ చేశారు.

Also Read..

ఆపరేషన్ సిందూర్ 2.0కు త్రివిధ ద‌ళాలు సిద్ధం : ఆర్మీ చీఫ్‌

ఉద్రిక్త‌త‌ల మ‌ధ్యే హ‌ర్మూజ్‌ను దాటుతున్న భార‌త నౌక‌లు.. సీక్రెట్‌ను రివీల్ చేసిన కేంద్రం

సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్‌పై సైబ‌ర్ దాడి

Advertisement
Advertisement