త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఇరాన్ వార్‌.. అన్ని రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని కీల‌క స‌మావేశం

PM Modi | అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో (Chief Ministers) ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 6:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల‌తో మాట్లాడ‌నున్నారు.

D

National | Published On Mar 26, 2026, 4.13 pm IST

PM Modi | ఇరాన్ వార్‌.. అన్ని రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని కీల‌క స‌మావేశం
Advertisement

PM Modi | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త ప‌రిస్థితుల కార‌ణంగా దేశంలో ఆందోళ‌నక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ కొర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ఆందోళ‌న వేళ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో (Chief Ministers) ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 6:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల‌తో మాట్లాడ‌నున్నారు. ప‌శ్చిమాసియాలో రోజురోజుకూ మారుతున్న ప‌రిస్థితులు, భార‌త్‌పై వాటి ప్ర‌భావాల‌ను స‌మీక్షించ‌నున్నారు.

మ‌రోవైపు రెండు రోజుల క్రితం త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో కేంద్రం స‌మావేశం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి యుద్ధ ప్ర‌భావాల‌పై చ‌ర్చించిన ప్ర‌భుత్వం ఇప్పుడు.. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో భేటీ అవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా స‌ర‌ఫ‌రా గొలుసులు, ఇంధ‌న భ‌ద్ర‌త‌ (energy security), విదేశాల్లో ఉన్న భార‌తీయుల భ‌ద్ర‌త వంటి స‌న్న‌ద్ధ‌త చ‌ర్య‌ల‌పై దృష్టి సారించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read..

ఇరాన్‌కు భారీ షాక్‌.. హ‌ర్మూజ్‌ను బ్లాక్ చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నావికా ద‌ళం చీఫ్ హ‌తం

నల్లసముద్రంలో రష్యా చమురు ట్యాంకర్‌పై దాడి

వ‌దంతులు న‌మ్మొద్దు.. స‌రిప‌డా పెట్రోల్‌, డీజిల్ ఉంది: స్టీఫెన్ రవీంద్ర

Advertisement

తాజావార్తలు

Advertisement