త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stephen Ravindra | చ‌మురుపై వ‌దంతులు న‌మ్మొద్దు.. బుధ‌వార‌మే 2,123 పెట్రోల్ ట్యాంకర్లు పంపించాం: స్టీఫెన్ రవీంద్ర

Stephen Ravindra | ప‌శ్చిమాసియా యుద్ధం నేప‌థ్యంలో ప‌ట్రోల్‌ (Petrol), డీజిల్(Diesel), ఎల్పీజీ(LPG) పై వ‌స్తున్న వదంతులు (Rumors) న‌మ్మొద్ద‌ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) ప్ర‌జ‌ల‌కు సూచించారు. తాజా పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల‌ను వివరించారు. బుధవారం 2,123 ట్యాంకర్ల‌ పెట్రోల్ సరఫరా చేశామన్నారు.

S

News | Published On Mar 26, 2026, 2.45 pm IST

Stephen Ravindra | చ‌మురుపై వ‌దంతులు న‌మ్మొద్దు..  బుధ‌వార‌మే 2,123 పెట్రోల్ ట్యాంకర్లు పంపించాం: స్టీఫెన్ రవీంద్ర
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: ప‌శ్చిమాసియా యుద్ధం నేప‌థ్యంలో ప‌ట్రోల్‌ (Petrol), డీజిల్(Diesel), ఎల్పీజీ(LPG) పై వ‌స్తున్న వదంతులు (Rumors) న‌మ్మొద్ద‌ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఈమేర‌కు గురువారం ఆయ‌న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాజా పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల‌ను వివరించారు. బుధవారం 2,123 ట్యాంకర్ల‌ పెట్రోల్ సరఫరా చేశామన్నారు.

బుధ‌వారం 2,123 ట్యాంక‌ర్లు పంపించాం..

హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. బుధవారం 2,123 ట్యాంకర్ల‌ పెట్రోల్ సరఫరా చేశామన్నారు. 10,799 లీటర్లు పంపించిన‌ట్లు వివరించారు. స‌గ‌టుగా 5,883 లీటర్ల పెట్రోల్ వినియోగం ఉంటే బుధవారం ఒక్క రోజే 84 శాతం అధికంగా పెట్రోల్ సరఫరా చేశారని చెప్పారు. ఆయిల్ కంపెనీలు 22,127 కిలో లీటర్ల డీజిల్ ను సరఫరా చేశాయని ఆయ‌న వెల్ల‌డించారు. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ 596 అవుట్ లెట్స్ ఉన్నాయన్నారు. ప్రతి బంకులో పౌరసరఫరా, సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ అధికారుల బృందం పరిశీలన చేస్తుందని తెలిపారు. గురువారం పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కాస్త‌ తగ్గిందని పేర్కొన్నారు.

రోజూ 2,20,000 గ్యాస్ బుకింగ్స్..

రాష్ట్రంలో గృహ వినియోగంలో 1,28,24,087 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని.. రోజూ 2,20,000 గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని వివ‌రించారు. బుధవారం ఒక్క రోజే 2,19,980 సిలిండర్లు సరఫరా చేశామన్నారు. వినియోగదారులు అధికంగా బుకింగ్స్ చేయడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు. అలాగే 1,03,275 పైప్ న్యాచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. 2,78,418 క్యూబిక్ మీటర్లు సరఫరా చేస్తున్నారని తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు పీఎన్జీ, సీఎన్జీని విస్తరించాల్సి ఉంద‌న్నారు. 24 గంటల్లో ప్లాంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పలు రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని స్టీఫెన్ రవీంద్ర వెల్ల‌డించారు.

ప్రభుత్వం ఎప్పటిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను పర్యవేక్షిస్తుందని చెప్పారు. బంకుల్లో ఉన్న చ‌మురు వివ‌రాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తెలుసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయ‌న వెల్ల‌డించారు. పెట్రోల్‌, డీజిల్ సరఫరాలో అంత‌రాయం లేకుండా స‌ర‌ఫరా చేస్త‌న్న‌ట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురి కావ‌ద్ద‌ని సూచించారు.

రాష్ట్రంలో 1.28 కోట్ల ఎల్పీజీ గృహ కనెక్షన్లు ఉండ‌గా వాటి సరఫరాలో ఎలాంటి లోటు లేదని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్‌ పరిధిలో 592 ఔట్‌లెట్స్​లో పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్ర‌చారం అవుతున్న వదంతులను ఎట్టిప‌రిస్థితుల్లో న‌మ్మొద్ద‌ని కోరారు. అన‌వ‌స‌ర వందంతులు సృష్టించొద్ద‌ని స్టీఫెన్ రవీంద్ర సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement