త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | UAE క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్‌ను కానుక‌గా ఇచ్చిన ప్ర‌ధాని మోదీ

PM Modi | త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా UAE క్వీన్ మదర్ (UAE Queen Mother) షేకా ఫాతిమాకు ప్రధాని నరేంద్ర మోదీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బాక్స్‌ (Karimnagar Filigree box)ను బ‌హుమ‌తిగా అందించారు.

D

Telangana | Published On May 21, 2026, 3.57 pm IST

PM Modi | UAE క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్‌ను కానుక‌గా ఇచ్చిన ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఐదు దేశాల ప‌ర్య‌ట‌న ముగిసింది. త‌న ప‌ర్య‌ట‌న‌ సంద‌ర్భంగా ఆయా దేశాధినేత‌ల‌కు ప్ర‌ధాని ప‌లు కానుక‌లు అందించారు. మ‌న సంస్కృతి, వార‌స‌త్వం ఉట్టిప‌డేలా ప‌లు ప్ర‌త్యేక కానుక‌ల‌ను అంద‌జేశారు. ఆ కానుక‌ల లిస్ట్‌లో తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌గా నిలిచే ప‌లు వ‌స్తువులు ఉండ‌టం విశేషం. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి కిష‌న్‌ రెడ్డి ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా UAE క్వీన్ మదర్ (UAE Queen Mother) షేకా ఫాతిమాకు ప్రధాని నరేంద్ర మోదీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బాక్స్‌ (Karimnagar Filigree box)ను బ‌హుమ‌తిగా అందించారు. దాంతోపాటూ మ‌హేశ్వ‌రి సిల్క్ వ‌స్త్రాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ అరుదైన వెండి నగిషీ (నక్షీ) పెట్టె భారతీయ హస్తకళల వైభవాన్ని చాటింది. అంత‌ర్జాతీయ వేదిక‌పై క‌రీంన‌గ‌ర్ సిల్వ‌ర్ ఫిలిగ్రీ క‌ళ‌కు మ‌రోసారి అరుదైన గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల స‌ర్వత్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

డెన్మార్క్ ప్ర‌ధానికి బిద్రీ సిల్వ‌ర్ వ‌ర్క్ వాజ్‌

ఇక డెన్మార్క్ ప్ర‌ధాని మెట్టె ఫ్రెడ‌రిక్స‌న్‌కు (Denmark PM Mette Frederiksen) హైద‌రాబాద్‌కు చెందిన బిద్రీ సిల్వ‌ర్ వ‌ర్క్ వాజ్‌ (Bidri Silver Work Vase)ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఇది వెండి నగిషీల కళాత్మకతకు, శతాబ్దాల నాటి లోహపు హస్తకళా సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. జింక్, రాగి లోహాల మిశ్రమంపై సున్నితమైన వెండి తీగలను చెక్కి, ప్రత్యేకమైన మట్టిని ఉపయోగించి నల్లటి రంగును తీసుకురావడం దీని ప్రత్యేకత. నల్లటి లోహంపై మెరిసే స్వచ్ఛమైన వెండితో త‌యారుచేసిన ఈ నగిషీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Also Read..

ఇక మ‌ద‌ర్సాల్లోనూ వందేమాత‌రం త‌ప్ప‌నిస‌రి.. బెంగాల్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్‌

ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. రూ.17,600కే 7 జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నం.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్‌

Advertisement
Advertisement