Uttam Kumar Reddy | ఎన్నికల కోసమే కేంద్రం చమురు ధరలు పెంచలే.. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసింది: ఉత్తమ్
Uttam Kumar Reddy | ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని, అంతర్జాతీయంగా సమస్య ఉన్నా కేవలం 5 రాష్ట్రాల ఎలక్షన్ల కోసమే ధరలు పెంచకపోవడం పెద్ద తప్పిదమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన వే టు న్యూస్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడారు.
- కాళేశ్వరం ఒక్క పిల్లర్ కూలినా ఫెయిల్ అయినట్లే
- రాజకీయం పక్కకు పెట్టి రిపేర్ చేయిస్తున్నం
- బీఆర్ఎస్ చేసిన తప్పుకు తక్షణం శిక్ష వేయలేం
- 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడమే మా లక్ష్యం
- కాంగ్రెస్ పాలనలో పూర్తి స్వేచ్ఛ ఉంది
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
Uttam Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని, అంతర్జాతీయంగా సమస్య ఉన్నా కేవలం 5 రాష్ట్రాల ఎలక్షన్ల కోసమే ధరలు పెంచకపోవడం పెద్ద తప్పిదమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఇంధనం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా నిద్ర లేచిందని ఎద్దేవా చేశారు. అటు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ కూడా తప్పు చేసిందన్నారు. శుక్రవారం ఆయన వే టు న్యూస్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడారు. తాను ఇండియన్ ఎయిర్ లైన్ విభాగంలో పనిచేశానని, ఒరిజినల్ హైదరాబాదీనని పేర్కొన్నారు.
నేను ఒరిజినల్ హైదరాబాదీని..
నేను రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చాను. ఒరిజినల్ హైదరాబాదీని. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అవకాశాలను వదిలేశారు. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఉంది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంతో పోల్చితే మా పాలనలో పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రజా డబ్బుతో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరానికి గుండెకాయ అయిన మేడిగడ్డ దెబ్బతింది. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం ఒక్క పిల్లర్ కూలినా అది ఫెయిల్ అయినట్టే. కాళేశ్వరం విషయంలో మేము రాజకీయం చేయాలనుకోవడం లేదు. పునరుద్ధరణ చర్యలు చేపట్టాం అని ఉత్తమ్ తెలిపారు.
ఈ సమ్మర్ లో CWPRS, NGRI, CWC తో పాటు ఇండియన్ ఆర్మీలో ఇంజినీరింగ్ విభాగాన్ని సైతం డిప్యుటేషన్ పై తీసుకొని పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. తెలంగాణలో 3 కోట్ల 60 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. రాష్ట్రంలో 85 శాతానికి పైగా ప్రజలు సన్నబియ్యం పొందుతున్నారు. పండించిన ప్రతి గింజను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మా ప్రభుత్వం ప్రతి క్రాప్ కు రూ.22 వేల కోట్లు కేటాయిస్తుంది. 65 లక్షల ఎకరాల్లో 60-70 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నం.
వెంటనే చర్యలు తీసుకోడానికి చైనా కాదు..
ఇండియాలో హైదరాబాద్ మేజర్ గ్రోతింగ్ సిటీ. దాదాపు ఏడేళ్లు కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశా. BRS చాలా ఆంక్షలు పెట్టింది. అపోజిషన్‌ను సైతం తొక్కాలని చూసింది. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్పులు చేశాం. అన్ని రంగాలకు స్వేచ్ఛ ఇచ్చాం. మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరానికి గుండెకాయ అని BRS చెప్పింది. అన్ని పరీక్షలు చేసిన అనంతరం కాళేశ్వరం విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రాజెక్టును రిపేర్ చేస్తున్నాం. పదేళ్ల పాలనలో BRS అనేక అవకాశాలను మిస్ చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో BRS తప్పు చేసింది. చైనా, నార్త్ కొరియా లాంటి దేశాల్లో తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష ఉంటుంది. మన దేశంలో తప్పులు నిరూపణ జరిగి శిక్షలు పడటానికి సమయం పడుతుందని అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
- ●Mamitha Baiju | ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్టర్లు - మమితా బైజు హీరోయిన్ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్
- ●E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..
- ●Amarnath Yatra 2026 | మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!
- ●Mohanlal | నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నాయి: మోహన్ లాల్
- ●OTT | సెన్సార్ నుంచి 127 కట్స్ - ఓటీటీలో బ్యాన్ - వివాదాస్పద సినిమా సత్లుజ్ కథ ఏంటి?
- ●PM Modi Tour's | మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని

Mamitha Baiju | ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్టర్లు - మమితా బైజు హీరోయిన్ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్

E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..

Amarnath Yatra 2026 | మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!

Mohanlal | నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నాయి: మోహన్ లాల్






