త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | రాజీప‌డిన ప్ర‌ధాని.. అదానీ కోస‌మే అమెరికాతో ట్రేడ్ డీల్ : రాహుల్ గాంధీ

Rahul Gandhi | గౌత‌మ్ అదానీ (Gautam Adani) కోస‌మే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) అమెరికాతో వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) కుదుర్చుకున్నార‌ని లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. అమెరికా-భారత్ మధ్య జరిగింది ట్రేడ్ డీల్ కాదని.. బేరసారం అని వ్యాఖ్యానించారు.

D

National | Published On May 15, 2026, 1.55 pm IST

Rahul Gandhi | రాజీప‌డిన ప్ర‌ధాని.. అదానీ కోస‌మే అమెరికాతో ట్రేడ్ డీల్ : రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ (Gautam Adani) కోస‌మే ప్రధాని అమెరికాతో వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) కుదుర్చుకున్నార‌ని ఆరోపించారు. అమెరికా-భారత్ మధ్య జరిగింది ట్రేడ్ డీల్ కాదని.. బేరసారం అని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. "రాజీపడిన ప్రధాని అమెరికాతో కుదుర్చుకున్నది వాణిజ్య ఒప్పందం కాదు.. అదానీని విడిపించేందుకు చేసిన బేరసారాలు" అని విమర్శించారు.

సోలార్ విద్యుత్ కాంట్రాక్టుల కోసం లంచాలు ఇవ్వడంతో పాటు పెట్టుబడిదారులను మోసగించారనే అభియోగాలతో గౌతమ్ అదానీపై 2024 నవంబరులో అమెరికాలో కేసులు నమోదయ్యాయి. అయితే, అదానీపై న‌మోదైన కేసుల‌ను ఉప‌సంహ‌క‌రించుకునేందుకు అమెరికా న్యాయ శాఖ యోచిస్తోందంటూ అంత‌ర్జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అదానీపై న‌మోదైన కేసుల‌ను ర‌ద్దు చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు న్యూయార్క్ టైమ్స్‌, బ్లూమ్ బ‌ర్గ్ నివేదించాయి. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాయి. ఈ వార్త‌ల వేళ రాహుల్ పైవిధంగా స్పందించారు.

అదానీపై ఆరోప‌ణ‌లు..

2024 న‌వంబ‌ర్‌లో దాఖలైన దావాలో.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (Adani Green Energy Ltd) డైరెక్టర్ సాగర్ అదానీపై అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ( Securities and Exchange Commission) తీవ్ర ఆరోపణలు చేసింది. 2020-2024 మ‌ధ్య కాలంలో భారీ సోలార్ విద్యుత్ (solar energy supply) కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం గౌతమ్ అదానీ, సాగర్ అదానీ కలిసి భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు రూ.2,500 కోట్ల లంచాలు ఇవ్వడానికి అంగీకరించారని పేర్కొంది. ఈ లంచాల ద్వారా దక్కించుకున్న సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులతో 20 ఏళ్ల కాలంలో దాదాపు రూ.16,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాలని అదానీ గ్రూప్ ప్రణాళిక వేసిందని యూఎస్ ఎస్‌ఈసీ పేర్కొంది. అంతేకాదు, త‌మ సంస్థ అవినీతి నిరోధ‌క విధానాలు, నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉందంటూ త‌ప్పుడు, త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌లు చేసి అమెరికా సంస్థ‌లు స‌హా వివిధ మార్గాల ద్వారా అదానీ గ్రూప్ రెండు బిలియ‌న్‌ డాల‌ర్ల రుణాలు, బాండ్ల‌ను సేక‌రించిన‌ట్లు ఆరోపించింది.

Also Read..

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్ర‌మంగా ఓటేసిన విదేశీయులు.. 10 మంది అరెస్ట్‌

స‌నాత‌నాన్ని నిర్మూలించ‌డం అంటే.. గుడికి వెళ్లొద్ద‌ని కాదు : ఉద‌య‌నిధి స్టాలిన్‌

వ‌చ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ ప‌రీక్ష‌.. ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి

Advertisement
Advertisement