PM Modi | సమగ్ర భాగస్వామ్య స్థాయికి భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు : ప్రధాని మోదీ
PM Modi | భారత్, స్లోవేకియా (India-Slovakia) దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాయి. ఇరు దేశాల బంధాన్ని 'సమగ్ర భాగస్వామ్యం' (Comprehensive Partnership) స్థాయికి పెంచుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
PM Modi | భారత్, స్లోవేకియా (India-Slovakia) దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాయి. ప్రధాని మోదీ (PM Modi) ప్రస్తుతం స్లోవేకియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 1993లో ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికో (Robert Fico)తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల బంధాన్ని 'సమగ్ర భాగస్వామ్యం' (Comprehensive Partnership) స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
"భారత్, స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఈ భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ప్రాధాన్యతలు, భవిష్యత్ లక్ష్యాలకు ప్రతీకగా నిలుస్తుంది" అని ప్రధాని పేర్కొన్నారు. ఇండియా-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఖరారులో స్లోవేకియా అందించిన సహకారానికి ప్రధాని ఫికోకు మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేయడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు. దీంతో ఇరు దేశాల పరిశ్రమలు, స్టార్టప్‌లు, వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
కీలక నిర్ణయాలు..
ఫికో కేవలం అనుభవజ్ఞుడైన నాయకుడు మాత్రమే కాదని.. భారతదేశానికి నిజమైన ఫ్రెండ్ అని ప్రధాని మోదీ తెలిపారు. భారత్-స్లోవేకియా సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన సహకారం కీలకమన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్యంలో సహకారాన్ని విస్తరించడం గురించి ఫికోతో సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రధాని తెలిపారు. ఆటోమొబైల్, రైల్వే, అధునాతన తయారీ రంగం, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాని వివరించారు. డిజిటల్ టెక్నాలజీపై ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Digital Public Infrastructure) రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీకి స్వాగతం పలకడం మాకు దక్కిన గౌరవం.. ఫికో
ఇదే సమయంలో, భారత్-స్లోవేకియా దేశాల మధ్య సహకారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ.. దానిని "సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం" (Comprehensive and Strategic Collaboration)గా మారుస్తున్నట్లు స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో స్పష్టం చేశారు. స్లోవేకియాలో ఒక భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి అని ఫికో తెలిపారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా డిజిటల్ సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ఫికో ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 'శాశ్వత సభ్యులు'గా ఉండాలని తాము బలంగా నమ్ముతున్నామని ఈ సందర్భంగా స్లోవేకియా ప్రధాని స్పష్టం చేశారు. అదేసమయంలో అత్యంత సుదీర్ఘకాలం పాటూ సేవలందించిన ప్రధానిగా నిలిచిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read..
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం.. బ్రిటన్ ప్రధాని కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం: ఆ 14 పాయింట్ల ఫ్రేమ్‌వర్క్‌లో ఏముంది?
తాజావార్తలు
- ●Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై
- ●Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు
- ●iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..
- ●Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం
- ●Telangana 22A Lands | భూయజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు
- ●Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుకలు

Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై

Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు

iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..

Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం






