PM Modi | స్లొవేకియాలో అడుగుపెట్టిన మోదీ.. తొలి భారత ప్రధానిగా రికార్డ్
PM Modi | మూడు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) స్లొవేకియాలో (Slovakia) అడుగుపెట్టారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్న ప్రధాని మోదీకి సాంప్రదాయ పద్ధతిలో రొట్టె, ఉప్పు అందించి ఘన స్వాగతం పలికారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్: మూడు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) స్లొవేకియాలో (Slovakia) అడుగుపెట్టారు. స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్న ప్రధాని మోదీకి సాంప్రదాయ పద్ధతిలో రొట్టె, ఉప్పు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వందేమాతర గీతం ఆలపించారు. దీంతో 1993లో ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడ పర్యటించే తొలి భారత ప్రధానిగా నిలిచారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని (Peter Pellegrini), ప్రధాని రాబర్ట్ ఫికోతో (Robert Fico) మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు.వ్యాపార, ఆర్థిక సంబంధాలు: ఉభయ దేశాల మధ్య ఆటోమొబైల్ రంగాలు, రక్షణ మరియు వాణిజ్య పెట్టుబడులను మరింత పెంచడంపై స్లోవేకియా వ్యాపార దిగ్గజాలతో చర్చించారు.
స్లోవేకియాలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ (Indian Diaspora) సభ్యులతోనూ ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేస్తున్నారని మోదీని ప్రశంసించారు. ప్రధాని మోదీ తన వారం రోజుల యూరప్ పర్యటనలో భాగంగా మొదట ఫ్రాన్స్‌లోని నీస్ నగరానికి వెళ్లి, అక్కడి నుంచి స్లోవేకియా చేరుకున్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ఈ నెల 16, 17 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరుగనున్న జీ7 (G7) శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు.

చిన్నదేశమే.. అయినా..
సుమారు 55 లక్షల జనాభా కలిగిన స్లోవేకియా భౌగోళికంగా చిన్న దేశమే అయినప్పటికీ, యూరప్ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తలసరి కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానాల్లో నిలుస్తున్న ఈ దేశంలో అనేక అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు తమ భారీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాయి. దీంతో ఆటోమొబైల్, ఇంజనీరింగ్, అధునాతన తయారీ రంగాల్లో స్లోవేకియా కీలక కేంద్రంగా మారింది. భారత్–స్లోవేకియా ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటికే 2025 నాటికి 1.6 బిలియన్ యూరోలకు చేరుకుంది.
The team of Lucnica Ensemble sang Vande Mataram during the welcome in Bratislava.
This comes at a time when we are marking 150 years of Vande Mataram and recalling its glorious contribution to India’s history and freedom struggle. pic.twitter.com/loVBUzG5oo
— Narendra Modi (@narendramodi) June 15, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్






