Social Media | 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం.. బ్రిటన్ ప్రధాని కీలక ప్రకటన
Social Media | బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తాజాగా కీలక ప్రకటన చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలు స్నాప్‌చాట్ (Snapchat), టిక్‌టాక్ (TikTok), యూట్యూబ్ (YouTube) వంటి ప్లాట్‌ఫారమ్‌లతో సహా పలు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా నిషేధం విధించనున్నట్లు ప్రకటించారు.
International | Published On Jun 15, 2026, 4.09 pm IST
Social Media | నేటి డిజిటల్ ప్రపంచంలో చిన్నారులపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో చిన్నారులను సోషల్ మీడియా (Social Media) వ్యసనం నుంచి దూరం చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం 16 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం (Social Media Ban) విధించిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ కూడా 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని చట్టబద్ధం చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా ఈ జాబితాలో బ్రిటన్ (Britain) కూడా వచ్చి చేరింది.
ప్రధానిగా కాదు.. ఇద్దరు పిల్లల తండ్రిగా
బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తాజాగా కీలక ప్రకటన చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలు స్నాప్‌చాట్ (Snapchat), టిక్‌టాక్ (TikTok), యూట్యూబ్ (YouTube) వంటి ప్లాట్‌ఫారమ్‌లతో సహా పలు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా నిషేధం విధించనున్నట్లు ప్రకటించారు. ఎక్కువ సమయం స్క్రీన్‌ను చూడటం వల్ల వారిలో తలెత్తే మానసిక, ఆరోగ్య సమస్యలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇది దేశ ప్రధానిగానే కాకుండా.. ఇద్దరు పిల్లల తండ్రిగా తాను తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయం అని పేర్కొన్నారు. ఈ నిషేధాన్ని అమలు చేయడానికి అవసరమైన చట్టపరమైన అధికారాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని బ్రిటన్ ప్రధాని వెల్లడించారు.
వ్యతిరేకిస్తే.. ఎదురుతిరుగుతా..
ఈ నిర్ణయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చన్నారు. అయినప్పటికీ తమ దేశంలోని పిల్లల భద్రత, సంతోషం కోసం రాజీపడేది లేదని స్పష్టం చేశారు. టెక్ కంపెనీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తాను ఎదురు తిరుగుతానని పేర్కొన్నారు. మార్పు కోసం తపిస్తున్న ఎన్నో కుటుంబాల బాధను తాను స్వయంగా విన్నానని చెప్పిన స్టార్మర్.. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రధాని వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఇండొనేషియా వంటి దేశాలు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్, స్పెయిన్, డెన్మార్క్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా ఇదే తరహా నిర్ణయాలను పరిశీలిస్తున్నాయి.
భారత్‌లో..
ఇక భారత్‌లో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఏపీ, గోవా రాష్ట్రాలు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
Also Read..
ఇరాన్‌తో ట్రంప్ డీల్.. దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో సూచీలు..
Devi Prasad | అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలి : దేవీప్రసాద్
బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ కల్యాణ్.. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ధ్వజం
సంబంధిత వార్తలు

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
ఆగస్టు 20, 2026

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
ఆగస్టు 20, 2026

CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని

Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..



