త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malisetti Dancing Daffodils | ఘట్‌కేసర్‌లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’!

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌లో సరికొత్త సంచలనం! ఘట్‌కేసర్‌లో 72 అంతస్తులతో 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్' స్కైస్క్రాపర్ రాబోతోంది. దీని విశేషాలు, ధర వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

J

Hyderabad | Published On Jun 15, 2026, 6.22 pm IST

Malisetti Dancing Daffodils | ఘట్‌కేసర్‌లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’!
Advertisement

Malisetti Dancing Daffodils | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఇప్పటివరకు వెస్ట్ హైదరాబాద్‌కే పరిమితమైన భారీ స్కైస్క్రాపర్స్ (Skyscrapers) ఇప్పుడు తూర్పు వైపు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఘట్‌కేసర్‌లో (Ghatkesar) ఏకంగా 72 అంతస్తులతో 'మాలిశెట్టి డ్యాన్సింగ్ డాఫోడిల్స్' (Malisetti's Dancing Daffodils) అనే సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ రాబోతోంది. ఆకాశాన్ని తాకే ఈ వినూత్న నిర్మాణం తూర్పు హైదరాబాద్‌కే తలమానికంగా నిలవనుంది.

అందమైన వంపు ఆకృతి.. ఆకాశమే హద్దుగా

సాధారణ అపార్ట్‌మెంట్‌ టవర్లకు భిన్నంగా దీని డిజైన్ ఉండబోతోంది. డ్యాన్సింగ్ డాఫోడిల్స్ (పువ్వుల) తరహాలో అందమైన వంపులతో ఈ 72 అంతస్తుల బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడే వారి కోసం, సిటీ వ్యూ (City vistas) స్పష్టంగా కనిపించేలా, ప్రెసిషన్ ఇంజనీరింగ్‌తో (Precision engineering) దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

Malisetti's Dancing Daffodils 72-Floor Skyscraper in Ghatkesar

ధర ఎంత? వసతులు ఏమున్నాయి?

ఈ ఐకానిక్ టవర్‌లో 3 BHK ఫ్లాట్ల ధర రూ. 2 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. కేవలం నాలుగు గోడలు మాత్రమే కాకుండా, ఒక కంప్లీట్ లైఫ్‌స్టైల్ ఎకోసిస్టమ్‌ను (Lifestyle ecosystem) ఇక్కడ అందిస్తున్నారు. 35కు పైగా వరల్డ్ క్లాస్ అమెనిటీస్ (World-class amenities) ఈ ప్రాజెక్ట్ సొంతం.

Malisetti's Dancing Daffodils 72-Floor Skyscraper in Ghatkesar

ప్రధాన ఆకర్షణలు ఇవే

  • ఆకాశంలో తేలియాడే అనుభూతినిచ్చే ఇన్ఫినిటీ పూల్ (Infinity Pool)
  • మోడ్రన్ ఫిట్‌నెస్ సెంటర్, స్పా వెల్‌నెస్
  • ఆహ్లాదం పంచే స్కై గార్డెన్ (Sky Garden)
  • విశాలమైన గ్రాండ్ క్లబ్‌హౌస్
  • మినీ థియేటర్ అండ్ లైబ్రరీ (కో-వర్క్ స్పేస్)
  • స్మార్ట్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ, గ్రీన్ సిస్టమ్స్

వీటితో పాటు కిడ్స్ ప్లే జోన్, స్పోర్ట్స్ కోర్ట్స్ వంటి మరో 20కి పైగా సదుపాయాలు ఈ కమ్యూనిటీలో ఉన్నాయి.

తూర్పు హైదరాబాద్.. ఫ్యూచర్ గ్రోత్ ఇంజిన్

గత 20 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న 'మాలిశెట్టి' (Malisetti) గ్రూప్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం, ప్రాజెక్టులను ఆన్-టైమ్‌లో డెలివరీ చేయడంలో వీరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

Malisetti's Dancing Daffodils 72-Floor Skyscraper in Ghatkesar

ప్రస్తుతం తూర్పు హైదరాబాద్ (East Hyderabad) ఎడ్యుకేషన్, లైఫ్‌స్టైల్, ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులోనూ ఘట్‌కేసర్ (Ghatkesar) కీలకమైన గ్రోత్ కారిడార్‌గా మారింది. సిటీకి అద్భుతమైన కనెక్టివిటీ ఉండటం, ఇప్పుడిప్పుడే ఐటీ బూమ్ ఇటువైపు మళ్లుతుండటంతో.. సరైన ధరలో బెస్ట్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి డ్యాన్సింగ్ డాఫోడిల్స్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement