PM Modi | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
PM Modi | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
PM Modi | ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభం వైపు నడిపించిన పశ్చిమాసియా (West Asia) ఉద్రిక్తతలకు తెరపడింది. ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి అమెరికా (US Iran War) ముగింపు పలికింది. ఇరాన్‌తో (Iran) శాంతి ఒప్పందం కుదిరిందని (Peace Deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
"పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించాయి. ఎన్నో దేశాల్లో ప్రాణనష్టానికి కారణమైన ఈ యుద్ధానికి ముగింపు పలికేలా అమెరికా-ఇరాన్ ఓ అంగీకారానికి రావడం స్వాగతించే విషయం. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించడం, స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్యానికి భరోసా కల్పించడంలో ఈ పరిణామం సాయపడుతుందని భారత్ విశ్వసిస్తోంది. మిగిలిన సమస్యలపై కూడా చర్చలు జరిపి.. ఓ స్థిరమైన తుది ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాం" అని ప్రధాని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
India hopes that the implementation of this understanding will…
— Narendra Modi (@narendramodi) June 15, 2026
Also Read..
తుదిదశలో అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. త్వరలోనే నివేదిక : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాదు : రాఘవ లారెన్స్
200 అడుగుల లోతైన బావిలో పడిన ఆవు.. తర్వాత ఏం జరిగిందంటే!
తాజావార్తలు
- ●తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!
- ●Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
- ●MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల
- ●Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
- ●Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంటల వ్యవధిలో నలుగురి మృతి
- ●రేవంత్ ‘యూఎస్ టూర్’ బ్రేక్: వివాదాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చిన తెలంగాణ సీఎం!

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్






