CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై సోమవారం సచివాలయంలో ఆయన విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. 99 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలు, శాఖల వారీగా వచ్చిన ఫలితాలను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు.
CM Revanth Reddy | రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై సోమవారం సచివాలయంలో ఆయన విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. 99 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలు, శాఖల వారీగా వచ్చిన ఫలితాలను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాలపై అన్ని విభాగాలు నివేదికలు సమర్పించాయి. చురుగ్గా పాల్గొన్న శాఖలను సీఎం అభినందించారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయని అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యటనలపై నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. అవసరమైతే క్రమశిక్షణ చర్యలకు వెనకాడొద్దని స్పష్టం చేశారు. కొన్ని శాఖలు తమ పనితీరును ప్రజల్లోకి సరైన రీతిలో తీసుకెళ్లలేకపోయాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ తమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. మీడియా, డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు చేరువ కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని, గ్రామాల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ 99 రోజుల్లో జరిగిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ఆస్తుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశించారు.
గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించిన సీఎం, అక్కడ కొత్త భవనాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అన్ని పాఠశాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల్లో అన్ని స్థాయిల్లో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలల నుంచి కాలేజీల వరకు, పీహెచ్‌సీల నుంచి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల వరకు ఇదే విధానం వర్తింపజేయాలని చెప్పారు. జిల్లాల వారీగా వెంటనే ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాకు రాష్ట్ర స్థాయి నుంచి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్)గా నియమించాలని సూచించారు. వారు జిల్లా కలెక్టర్లతో కలిసి అన్ని శాఖల పనితీరును సమీక్షించి నివేదికలు తయారు చేయాలని చెప్పారు.
జిల్లాల వారీగా ప్రగతి నివేదికలను ప్రజలకు విడుదల చేయాలని, అలాగే మండలాలు, నియోజకవర్గాలు, గ్రామాల స్థాయిలో లబ్ధిదారుల వివరాలు, అభివృద్ధి పనుల సమాచారం డ్యాష్‌బోర్డులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీల అమలు పురోగతిపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్లానింగ్ విభాగాన్ని సీఎం ఆదేశించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత





