Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
Dasoju Sravan | రూ.30 వేల కోట్ల మెట్రో ఆస్తులను రూ.15 వేల కోట్లకే దక్కించుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకొంటున్నారని.. అలా చేయడానికి ఆయనేమైనా ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. మెట్రో ఆస్తులను తన బినామీలకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
- మోదీ, అమిత్‌షాకు ఆయన సరెండర్ అయ్యారు
- రేవంత్‌కు చేతనైతే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి
- రూ.13 వేల కోట్ల మెట్రో అప్పును ప్రజలపై రుద్దుతున్నారు
- కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే ఆయన అజెండా
- మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌పై దాసోజు ఫైర్
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్: రూ.30 వేల కోట్ల మెట్రో ఆస్తులను రూ.15 వేల కోట్లకే దక్కించుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకొంటున్నారని.. అలా చేయడానికి ఆయనేమైనా ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే రేవంత్ అజెండా అని.. ఆయనొక మూర్ఖుడు అని ఫైరయ్యారు. కేసీఆర్ చారిత్రక కట్టడాలను కాపాడుతూనే మెట్రో ఫేజ్-1 ను పూర్తి చేశారని గుర్తు చేశారు. మెట్రో ఆస్తులను తన బినామీలకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అదొక కుంభకోణం..
రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే ఆయన అజెండా. క్యూర్, ప్యూర్, రేర్ పైన అవగాహన లేదు. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? 2009 నుంచి కాంగ్రెస్ అసమర్థత వల్లే మెట్రో రైల్ ఆలస్యం అయింది. మెట్రోను రేవంత్ రెడ్డి మట్టిలో కలిపారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో దందాలు చేస్తున్నారు. మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని దాసోజు డిమాండ్ చేశారు.
రూ.13 వేల కోట్ల మెట్రో అప్పును తెలంగాణ ప్రజలపై రుద్దుతున్నారు. మెట్రో రైల్ సి.ఎఫ్.ఓ ను బెదిరించిన చరిత్ర రేవంత్ రెడ్డిది. హైటెక్ సిటీ టు శంషాబాద్ మెట్రో రైల్‌ను ఎందుకు రద్దు చేశారు? పెట్టుబడిదారులు హైదరాబాద్ రావాలంటే భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి తనపై కమిషన్ వేసుకోవాలి. మెట్రో ఫేజ్-2ను కిషన్ రెడ్డి అడ్డుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని శ్రవణ్ ప్రశ్నించారు.
బీజేపీ సీఎంలు కూడా మోదీని అన్నిసార్లు కలవలే..
ఇప్పటికే 71 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ సీఎంలు కలవనన్ని సార్లు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిశారు. మోదీని ఎపుడైనా మెట్రోపై నిలదీశారా? 8 మంది కాంగ్రెస్ లోక్ సభ సభ్యులు, 4 రాజ్యసభ సభ్యులు ఏం చేస్తున్నారు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ రాదు.. సొంత రాష్ట్ర కేంద్ర మంత్రితో ప్రాజెక్టు తీసుకురాలేని స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. మోదీ, అమిత్‌షాకు రేవంత్ సరెండర్ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌ను హిమంత బిశ్వ శర్మలా చూస్తుంది. రేవంత్‌కు చేతనైతే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి. కేసీఆర్ ఫొటో పెట్టుకుని రోజూ భజన చేయాలి. మోదీని ప్రసన్నం చేసుకుని ఓటుకు నోటు కేసులో తప్పించుకోవాలని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు అని ఎమ్మెల్సీ దాసోజు ఆరోపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
జులై 18, 2026

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026
తాజావార్తలు
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ

Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క



