ITR | ఐటీఆర్ గడువు దాటితే.. ఫైలింగ్ చేయలేమా.. ఏం జరుగుతుంది..?
ITR | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఇబ్బందులకు దారితీస్తాయి. రీఫండ్ తిరస్కరణతోపాటు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు, జరిమానాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ITR | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఇబ్బందులకు దారితీస్తాయి. రీఫండ్ తిరస్కరణతోపాటు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు, జరిమానాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిర్ణీత గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడి ఆదాయం, రిటర్న్ దాఖలులో జరిగిన ఆలస్యాన్ని బట్టి ఈ జరిమానా గరిష్ఠంగా రూ.5వేల వరకు ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే గరిష్ట జరిమానా రూ.1వేయి మాత్రమే. అయితే ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉంటే గరిష్ఠంగా రూ.5వేల వరకు లేట్ ఫైలింగ్ ఫీజు విధిస్తారు.
లేట్ ఫీజు చెల్లించాల్సిందే..
చాలామందికి ఒక అపోహ ఉంటుంది. పన్ను మినహాయింపులు లేదా రిబేట్ల కారణంగా తమపై ఎలాంటి ట్యాక్స్ బకాయి లేకపోతే జరిమానా ఉండదని భావిస్తారు. కానీ అది పూర్తిగ సరైనది కాదు. ఉద్యోగులు జూలై 31లోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గడువు మిస్ అయినా, 2026 డిసెంబర్ 31 వరకు ‘బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. పన్ను బకాయి సున్నా అయినప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. పాత పన్ను విధానంలో ఈ పరిమితి రూ.2.5 లక్షలు కాగా, కొత్త పన్ను విధానంలో ఇది రూ.4 లక్షలుగా ఉంది. ఒక పన్ను చెల్లింపుదారుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.9 లక్షల ఆదాయం పొందాడనుకుందాం. అతను 2026 జూలై 31లోగా ఐటీఆర్ దాఖలు చేయాలి. కానీ నవంబర్ 2026లో రిటర్న్ ఫైల్ చేస్తే, అతనికి అవకాశం ఉన్నప్పటికీ రూ.5వేల లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, గడువు తేదీ తర్వాత కూడా ఏదైనా పన్ను బకాయి మిగిలి ఉంటే, ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది.
ఎవరెవరు ఎప్పటిలోగా..?
ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల వర్గాల ఆధారంగా వేర్వేరు గడువులను నిర్ణయించింది. ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 దాఖలు చేసే ఉద్యోగులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జూలై 31లోగా రిటర్న్ ఫైల్ చేయాలి. ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని ఐటీఆర్-3, ఐటీఆర్-4 ఫైలర్లు ఆగస్టు 31 వరకు సమయం పొందుతారు. ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అయిన వ్యాపారులు, సంస్థలు అక్టోబర్ 31లోగా రిటర్న్ దాఖలు చేయాలి. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నిబంధనల పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులకు నవంబర్ 30 వరకు గడువు ఉంటుంది. నిర్దేశిత గడువులోగా రిటర్న్ దాఖలు చేయలేకపోయిన వారు డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ సమర్పించవచ్చు. అలాగే ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్‌లో తప్పులు ఉంటే, సాధారణంగా 2027 మార్చి 31 వరకు రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది.
సంబంధిత వార్తలు

ITR Refund | ఐటీఆర్‌ను ఫైల్ చేశాక రిఫండ్ ఎప్పుడు వస్తుంది.. రాకపోతే ఏం చేయాలి..?
ఆగస్టు 5, 2026

Income Tax Return | ఐటీఆర్ గడువు ముగిసింది.. అయినా ఫైల్ చేయలేదా.. ఇప్పుడెలా..?
ఆగస్టు 1, 2026

Income Tax Return | ట్యాక్స్ రిటర్న్‌కు చివరి గడువు నేడే.. ఇప్పటికే 5.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు
జులై 31, 2026
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి
- ●Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం
- ●Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ
- ●Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్
- ●Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?
- ●Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు

Tummala Nageshwar Rao | ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి

Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం

Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్



