త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | ఇక తెలంగాణలో దొంగ ఓట్లుండ‌వ్‌.. అస‌లైన లిస్టును త‌యారు చేద్దాం

Ramchandar Rao | తెలంగాణ‌లో ఇక దొంగ ఓట్లు ఉండ‌వ‌ని.. అస‌లైన ఓట‌ర్ లిస్టును త‌యారు చేసుకుందామ‌ని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు. స‌ర్ విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు స‌రికాద‌న్నారు.

S

Telangana | Published On Jun 15, 2026, 2.30 pm IST

Ramchandar Rao | ఇక తెలంగాణలో దొంగ ఓట్లుండ‌వ్‌.. అస‌లైన లిస్టును త‌యారు చేద్దాం
Advertisement
  • కేంద్ర ఎలక్ష‌న్ క‌మిష‌న్‌ను త‌ప్పు ప‌ట్టొద్దు
  • అస‌లు స‌ర్ తెచ్చిందే కాంగ్రెస్‌
  • ఓట్లు, సీట్లు చోరీ చేసిందే వారు
  • బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు ఎందుకు వ్య‌తిరేకిస్తున్న‌యో
  • తెలంగాణ ఓట‌ర్ లిస్టులో పాకిస్థానీయుల పేర్లు పెట్ట‌మంటారా?
  • బీజేపీ చీఫ్‌ రాంచంద‌ర్‌రావు ఫైర్‌

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో ఇక దొంగ ఓట్లు ఉండ‌వ‌ని.. అస‌లైన ఓట‌ర్ లిస్టును త‌యారు చేసుకుందామ‌ని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. స‌ర్ విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు స‌రికాద‌న్నారు. సీఈసీలకు గతంలో కాంగ్రెస్‌ పార్టీ పద్మ పురస్కారాలు, రాజ్యసభ పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. గ‌తంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 12 సార్లు జరిగింద‌ని.. అది తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. ఎస్‌ఐఆర్‌లో ప్రతి పార్టీ బీఎల్‌ఏ-2ను నియమించుకుంటుందని, అభ్యంతరాలుంటే ఆయా పార్టీల బీఎల్‌ఏ2లు వెంటనే చెప్తారని వివ‌రించారు.

కేర‌ళంలో యూడీఎఫ్ గెలిచింది క‌దా?

ఎస్‌ఐఆర్‌లో దొంగ నోట్లు, డూప్లికేట్‌ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఈ ప్రక్రియతో భాజపాకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌దే బాధ్య‌త‌. మోదీ ఇప్పుడు చేస్తున్న‌ది కాదు. స‌ర్ తెచ్చిందే కాంగ్రెస్. అప్పుడు మేం స‌పోర్ట్ చేసినం. ఈరోజు వీళ్లు ఎందుకు వ్య‌తిరేకిస్తున్న‌రు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే మాట మాట్లాడుతున్న‌రు. కేర‌ళంలో కూడా స‌ర్ జ‌రిగింది.. అక్క‌డి యూడీఎఫ్ గెలిచింది. మ‌రి దీనికి ఏం స‌మాధానం చెప్ప‌రు. త‌మిళ‌నాడులో కూడా స్టాలిన్ ఓడిపోయారు. దాన్ని ఏమంట‌రు? ప్ర‌జా నిర్ణ‌యాన్ని అవ‌మాన‌ప‌ర‌చొద్దు. మీరు ఓడిపోయారు. మేం ఓడిపోయాం అని రాంచంద‌ర్‌రావు వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రించాలి. 2025లో సుప్రీంకోర్టు దాదాపు 124 పేజీల ఆర్డ‌ర్ ఇచ్చింది. స‌ర్ రాజ్యాంగానికి వ్య‌తిరేకం కాదు. ఇది చాలా అవ‌స‌రం. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు అధికారం ఉంది కాబ‌ట్టే స‌ర్ నిర్వ‌హిస్తున్నారు. స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో రొహింగ్యాలు అక్ర‌మంగా ప్ర‌వేశిస్తున్నారు అని సుప్రీంకోర్టే చెప్పింది అని ఆయ‌న చెప్పారు.

కాంగ్రెస్ ఎప్పుడూ బోగ‌స్ ఓట్ల‌తోనే గెలిచింది..

హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీలో కూడా దొంగ ఓట్లు న‌మోద‌వుతున్నాయి. తెలంగాణ ఓట‌ర్ లిస్టులో రొహింగ్యాల‌వి, పాకిస్థాన్ వాళ్ల‌వి యాడ్ చేయాలా? బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు స‌మాధానం చెప్పాలి. హైద‌రాబాద్‌లో దాదాపు 5 వేల మంది పాకిస్థానీయులు ఉన్న‌రు. 12 సార్లు చేసిన స‌ర్ మీద ఎందుకు మాట్లాడ‌రు? కాంగ్రెస్ ఎప్పుడూ కూడా బోగ‌స్ ఓట్ల‌తోనే గెలిచింది. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు రోహింగ్యాల‌ను ఓట‌ర్ లిస్టులో పేర్లు పెట్టిస్తున్న‌రు. ప్ర‌తి రాజ‌కీయ పార్టీ బీఎల్ఏల‌ను పెట్టాల్సిందే. పార‌ద‌ర్శ‌క‌త కోస‌మే వారిని పెడ‌తారు. రాంగ్ డిక్ల‌రేష‌న్ ఇస్తే శిక్ష‌కు అర్హుల‌వుతారు అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు హెచ్చ‌రించారు.

అప్పుడు సోనియాగాంధీ ఇండియ‌న్ సిటిజ‌న్ కాదు..

1980లో ఇందిరాగాంధీ ఇంటిలో సోనియాగాంధీ ఓట‌ర్‌. అప్పుడు ఆమె ఇండియ‌న్ సిటిజ‌న్ కాదు. ఇది ఓటు చోరీ కాదు. వీళ్ల‌ది మెద‌డు చోరీ అయింది. ఓటు చోరీ మొద‌లు పెట్టింది మీరు. 1975లో అల‌హాబాద్ హైకోర్టు చెప్పిన త‌ర్వాత దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని చోరీ చేసింది మీరు కాదా? కాంగ్రెస్ పార్టీయే సీట్ చోరీ చేసింది. నెహ్రూ ప్ర‌ధాన‌మంత్రి సీటును చోరీ చేయ‌లేదా? పీఎం నెహ్రూ టైంలో సుకుమార్‌సేన్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌గా ఉండే. అత‌నికి ప‌ద్మ‌శ్రీ ఇచ్చారు. క‌ళ్యాణ్ సుంద‌ర్‌కు ప‌ద్మ‌విభూష‌న్ ఇచ్చారు. ఎందుకంటే మీకు స‌హ‌కారం చేశారు కాబ‌ట్టి. ఇలా చాలా మందికి ఇచ్చారు. ఖురేషి ద‌గ్గ‌ర నుంచి జ్ఞానేశ్‌కుమార్ దాకా మేం ఎవ‌రికీ ఏం ఇవ్వ‌లే. ఇది మా ప‌నితీరు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

డ్యాన్స్ ఎందుకు చేయ‌లేదంటే స్టేజీ బాగా లేద‌న్న‌డ‌ట అన్న‌ట్లు ఉంది..

మీకు చేత‌గాక‌పోతే మా మీద ప‌డి ఏడ‌వ‌కండి. దొంగ ఓట్లు, చనిపోయిన వారివి, విదేశాల్లో స్థిర‌ప‌డిన వారివి తీయ‌డానికే స‌ర్ పెట్టారు. సీఎం కూడా అబ‌ద్దాలు మాట్లాడుతున్న‌రు. కాంగ్రెస్ పార్టీ అబ‌ద్దాల‌కు త‌ల్లిగా మారింది. అబ‌ద్దాలు కాంగ్రెస్ వాళ్ల‌కే పెట్టిన విద్య‌. ఓటు కొనుగోలు కేసులో సీఎం చోరీ చేయ‌లేదా? మా మీద ఏడుపు మీ ప‌త‌నానికి నాంది. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందంటే స‌ర్ పెట్టడం వ‌ల్ల‌నే అంటున్న‌రు. ఎందుకు డ్యాన్స్ చేయ‌లేక‌పోయిన‌వంటే స్టేజీ బాగాలేద‌న్న‌డ‌ట అన్న‌ట్లుంది. బీజేపీ రేపు తెలంగాణ‌లో గెల‌వ‌బోతుంది. ఈ ప్ర‌క్షాళ‌న‌లో మోదీకి, కేంద్ర ప్ర‌భుత్వానికి సంబంధం లేదు. ఇది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ బాధ్య‌త అని ఆయ‌న పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ను హెచ్చ‌రిస్తున్నా. ఇక తెలంగాణ‌లో దొంగ ఓట్లు ఉండ‌వ్‌. బంగ్లాదేశీయుల ఓట్లు అస‌లే ఉండ‌వ్‌. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌కండి. మీ త‌ప్పుల‌ను మా మీద రుద్ద‌కండి. డ‌బుల్ ఓట్లు ఇక ఉండొద్దు. అస‌లైన ఓట‌ర్ లిస్టును త‌యారు చేసుకుందాం అని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు కోరారు.

 

Advertisement
Advertisement