Kerala Story 2 Review | కేరళ స్టోరీ 2 రివ్యూ – వివాదాస్పద సినిమా ఎలా ఉంది? వాస్తవ ఘటనలతోనే తెరకెక్కిందా?
అనేక వివాదాల నడుమ శుక్రవారం కేరళ స్టోరీ 2 మూవీ థియేటర్లలోకి వచ్చింది. లవ్ జిహాద్, గజ్వా ఏ హింద్ అనే అంశాలను చర్చిస్తూ దర్శకుడు కామఖ్య నారాయణ్‌సింగ్ ఈ సినిమాను తెరకెక్కించారు.
Entertainment | Published On Feb 28, 2026, 11.49 am IST
Kerala Story 2 Review | కేరళ స్టోరీ 2.... గత కొద్ది రోజులుగా వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలుస్తోంది ఈ మూవీ. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ స్వయంగా కేరళ ముఖ్యమంత్రి ట్వీట్ చేశాడు. కేరళ స్టోరీ 2కు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రిలీజ్ ముగింట స్టే కారణంగా సినిమా వాయిదాపడింది. చివరకు కోర్టు జోక్యంతో శుక్రవారం సాయంత్రం నుంచి కేరళ స్టోరీ 2 థియేటర్లలోకి వచ్చింది. కేరళ స్టోరీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కామఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కాంట్రవర్షియల్ మూవీ ఎలా ఉందంటే?
ముగ్గురు యువతుల కథ...
గ్వాలియర్‌కు చెందిన దివ్యకు సోషల్ మీడియా అంటే పిచ్చి. రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని కలలుకంటుంది. తల్లిదండ్రులు వెకిలివేషాలు వద్దంటూ మందలిస్తారు. దివ్యను ఓ పెద్ద సెలిబ్రిటీని చేస్తానని రషీద్ అనే వ్యక్తి నమ్మిస్తాడు. రషీద్ మాయలో పడిన దివ్య అతడిని పెళ్లిచేసుకుంటుంది. పెళ్లి తర్వాత ఆమె పేరును అలియాగా మారుస్తాడు రషీద్. అత్తింట్లో అలియా జీవితం ఎలా నరకప్రాయంగా మారింది? అలియాను రషీద్ ఎందుకు ట్రాప్ చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
నేహా ఓ అథ్లెట్. జావెలిన్ త్రో గేమ్స్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని కలలు కంటుంది. నేహా లక్ష్యాన్ని ప్రోత్సహిస్తుంటాడు రాజు. అతడిలో ప్రేమలో పడిన నేహా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాతే రాజు అసలు పేరు ఫైజాన్ అనే నిజం బయటపడుతుంది. వేశ్యగా మారిన నేహా జీవితం చివరకు ఎలా విషాదంగా ముగిసింది అన్నది మరో కథ.
సురేఖ యూపీఎస్‌సీ సాధించాలనే ప్రయత్నంలో ఉంటుంది. సలీమ్ అనే జర్నలిస్ట్‌తో సురేఖకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిగా సురేఖ ముందు నటిస్తాడు సలీమ్. హిజాబ్ ధరించమని అడగనని, మతం మారమని చెప్పనని ఎన్నో హామీలు ఇస్తాడు. కానీ పెళ్లి తర్వాత సలీమ్ నిజస్వరూపం బయటపడుతుంది. సురేఖను బీఫ్ తినమని బలవంతం చేస్తాడు. మత మార్పిడికి ఓప్పుకోకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేస్తాడు? అతడి బారి నుంచి సురేఖ తప్పించుకుందా? లేదా అన్నది మరో కథ.
గజ్వా ఏ హింద్...
2023లో వచ్చిన కేరళ స్టోరీ మూవీలో ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను మోసం చేసి మత మార్పిడిలకు పాల్పడటమే కాకుండా వారిని ఉగ్రవాదులుగా ఎలా మారుస్తున్నారన్నది చూపించారు.కేరళ స్టోరీ సీక్వెల్‌లో మాత్రం లవ్ జిహాద్, గజ్వా ఏ హింద్ (ముస్లిం దేశంగా మార్చే ప్రయత్నం) లాంటి కుట్రలను చూపించారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు మేకర్స్ ప్రకటించారు. మేకర్స్ క్రియేటివ్ ఫ్రీడమ్ మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది. కథ పరంగానే కాకుండా సీన్లు, డైలాగ్స్, పాటలు...ప్రతి విషయంలో ఓ వర్గం వారిని టార్గెట్ చేసి తీసినట్లుగా అనిపిస్తుంది.
హద్దులు దాటేశారు...
ఫస్ట్‌హాఫ్‌లో ముగ్గురు యువతల పరిచయం, ప్రేమ పేరుతో వారికి రషీద్, రాజు, సలీమ్ ఎలా దగ్గరయ్యారన్నది చూపించారు. నేటితరం యువత మనోభావాలకు దగ్గరగా ఈ ప్రేమకథలను తీర్చిదిద్దారు. మరోమతంలోకి మారిన అనంతరం వారు ఎదుర్కొన్న కష్టాలతో సెకండాఫ్ సాగుతుంది. కొన్ని సన్నివేశాల వాస్తవికంగా చూపించాలనే ప్రయత్నంలో దర్శకుడు పూర్తిగా హద్దులు దాటేశారు. సురేఖ చేత బీఫ్ తినిపించే సీన్, నేహాపై లైంగిక వేధింపులు, ఓ మహిళ మృతదేహాన్ని ముక్కలు చేసే సీన్లు కాస్త ఇబ్బందికరంగానే కనిపిస్తాయి.
లవ్ జిహాద్‌కు వ్యతిరేకం...
కేరళ స్టోరీ మాదిరిగా యువతుల కష్టాలను మాత్రమే చూపించి ఈ సినిమాను ఎండ్ చేయలేదు. ఆ అమ్మాయిలను ట్రాప్ చేసిన వారు ఎలాంటి శిక్షలకు గురయ్యారు అన్నది చూపించారు. బుల్డోజర్ ట్రీట్‌మెంట్ లాంటివి చూపించి ఆడియెన్స్‌ను కనెక్ట్ చేయాలని మేకర్స్ ప్రయత్నించారు.
కేరళ స్టోరీ ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ తీసిన సినిమా కాదని, కానీ కేవలం లవ్ జిహాద్, గజ్వా ఏ హింద్ గురించి ప్రజలకు చెప్పడానికే తీసిన సినిమా చూపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు – డైలాగ్ రైటర్ కామెంట్స్
జులై 25, 2026

Rashmika Mandanna | ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ బోల్డ్ మూవీ – పెళ్లికి ముందు సీక్రెట్ ఎఫైర్ బయటపడితే…
జులై 25, 2026

Ramayana | సీతగా సాయిపల్లవి ఎలా కనిపిస్తుందో తెలియదు : దీపికా చిఖ్లియా
జులై 25, 2026
తాజావార్తలు
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ



