PM Modi | స్త్రీ శక్తే.. బలమైన భారత్‌కు గుర్తింపు : ప్రధాని మోదీ
PM Modi | మన మహిళల శక్తే (women power) బలమైన భారతదేశానికి గుర్తింపు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల అచంచలమైన సంకల్పం, నిష్ఠ, సేవ ప్రతిరంగంలోనూ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
PM Modi | మన మహిళల శక్తే (women power) బలమైన భారతదేశానికి గుర్తింపు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల అచంచలమైన సంకల్పం, నిష్ఠ, సేవ ప్రతిరంగంలోనూ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
"మన స్త్రీ శక్తి శక్తివంతమైన భారతదేశానికి గుర్తింపు. దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల అచంచలమైన సంకల్పం, నిష్ఠ, సేవ ప్రతిరంగంలోనూ ప్రతిబింబిస్తోంది. అదే భారత్ కీర్తిని ఇనుమడింపజేస్తోంది. ఎవరైతే తన స్వశక్తితో ఈ విశ్వాన్ని సృష్టించారో, సమస్త దేవతల శక్తుల సమష్టి రూపంలో అవతరించారో, ఎవరు సకల దేవతలు, మహర్షులచే పూజించబడుతున్నారో, ఎవరికి మనం భక్తితో ప్రణమిల్లుతున్నామో.. ఆమె మనకు శుభాలను ప్రసాదిస్తుంది" అని ప్రధాని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లు సహా మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో (Parliament Session) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల చట్టం సత్వర అమలు, అందుకు వీలుగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లు–2026ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గురువారం ఈ బిల్లులపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మూడు బిల్లులపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ట్వీట్ పెట్టారు.
Also Read..
కేంద్ర మంత్రితో బాలీవుడ్ నటి ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
అదిరిపోయే సెల్ఫీ కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఒప్పో కొత్త ఫోన్లు
పాపం ప్రతాప్ రివ్యూ - తిరువీర్ బోల్డ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






