Papam Pratap Review | పాపం ప్రతాప్ రివ్యూ – తిరువీర్ బోల్డ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెరైటీ ప్రమోషన్స్‌తో తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Apr 17, 2026, 10.05 am IST
Papam Pratap Review | కెరీర్ ఆరంభం నుంచి సినిమాల ఎంపికలో వైవిధ్యంగా అడుగులు వేస్తున్నాడు యంగ్ హీరో తిరువీర్. మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాశి కీలక పాత్రల్లో నటించారు. దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ నిర్మించింది. పాపం ప్రతాప్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. కామెడీ కథతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో హీరోగా తిరువీర్ హిట్టు కొట్టాడా? లేదా? అంటే?
ప్రతాప్ పెళ్లి కథ....
సీతారామపురానికి చెందిన వీరయ్య (అజయ్ ఘోష్) ఊళ్లో ఎరువుల షాప్ నడుపుతుంటాడు. అతడి కొడుకు ప్రతాప్ (తిరువీర్) చిన్నప్పటి నుంచి తమ ఊరికే చెందిన బుజ్జమ్మను(పాయల్ రాధాకృష్ణ) ప్రేమిస్తుంటాడు. తండ్రి మాటను కాదని బుజ్జమ్మను పెళ్లి చేసుకుంటాడు ప్రతాప్. కానీ పెళ్లైన మూడు రోజులకే ప్రతాప్‌కు ఓ సమస్య ఉందని బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్‌కు ఉన్న సమస్య ఏమిటి? ప్రేమించిన భర్తను వదిలేసి బుజ్జమ్మ ఎందుకు వెళ్లిపోయింది? కొడుకు కారణంగా ఊళ్లో వీరయ్య పరువు మర్యాదలు ఎలాంటి ఇబ్బంది ఏర్పడింది? ప్రతాప్ లైఫ్‌లోకి వచ్చిన శ్యామ్ సుదర్శనం (అవసరాల శ్రీనివాస్) ఎవరు? ప్రతాప్ మామూలు మనిషి అయ్యాడా? తిరిగి బుజ్జమ్మ అతడిని వెతుక్కుంటూ వచ్చిందా అన్నదే పాపం ప్రతాప్ మూవీ కథ.
స్లీపింగ్ డిజార్డర్...
హీరోకు ఓ డిజార్డర్ ఉండటం...దాని నుంచి జనరేట్ అయ్యే ఫన్‌తో తెలుగులో భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి సినిమాలు వచ్చాయి. పాపం ప్రతాప్ కూడా ఆ బాపతు సినిమానే. ఇందులో స్లీపింగ్ డిజార్డర్ అనే సమస్యను టచ్ చేశారు డైరెక్టర్. తనకున్న డిజార్డరే ఓ యువకుడి వైవాహిక జీవితానికి ఎలా అడ్డంకిగా మారింది? తాను ప్రాణంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ప్రాణాలకు ప్రమాదమని తెలిసి అతడు ఎలాంటి సంఘర్షణకు లోనయ్యాడనే అంశాలతో దర్శకుడు ఈ కథ రాసుకున్నారు. ఎమోషన్స్‌కు కామెడీని బ్లెండ్ చేస్తూ ఫన్ రైడ్‌లా ఈ సినిమాను తెరకెక్కించారు.
హీరోహీరోయిన్ల పాత్రలకు పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కువగా టైమ్ తీసుకోలేదు. నేరుగా ప్రతాప్, బుజ్జమ్మల పెళ్లితోనే ఈ సినిమాను మొదలుపెట్టారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న కొడుకుకు...రేపు ఏదైనా సమస్య వస్తే అప్పుడు నీ తాట తీస్తా అని తండ్రి వార్నింగ్ ఇచ్చే సీన్‌తోనే సినిమాలో ఏదో ట్విస్ట్ ఉండబోతుందనే సస్పెన్స్‌ను బిల్డ్ చేశారు. మూడు రాత్రులు ముగియగానే భర్తకు వ్యతిరేకంగా బుజ్జమ్మ పంచాయితీ పెట్టడంతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ప్రతాప్‌లోని మగతాన్ని ఊరివాళ్లు శంకించడం, అతడిని గేగా భ్రమపడటం లాంటి సీన్లతో ఫస్ట్ హాఫ్ చక్కటి వినోదాన్ని పంచుతుంది. గోపరాజు రమణ క్యారెక్టర్‌ను ఫన్నీగా రాసుకున్నారు. షకీలా అభిమానిగా థియేటర్‌లో అతడు చేసే హడావిడి నవ్విస్తుంది. ప్రతి సీన్ నుంచి చక్కటి హాస్యం రాబట్టుకున్నారు.
క్లారిటీ మిస్....
తనకున్న సమస్య నుంచి గట్టెక్కడానికి హీరో చేసే ప్రయత్నాల చుట్టూ సెకండాఫ్‌ను నడిపించారు. ఓవర్ సెంటిమెంట్‌తో కాకుండా ఈ సీన్లలో అంతర్లీనంగా వినోదం ఉండేలా జాగ్రత్తపడ్డారు. భర్త విషయంలో బుజ్జమ్మ తీసుకునే నిర్ణయంతో క్లైమాక్స్‌ను కన్వీన్సింగ్‌గానే అనిపిస్తుంది.
కామెడీ పరంగా దర్శకుడు ఆకట్టుకున్నా కీలకమైన ఎమోషన్స్ విషయంలో తడబడ్డాడు. హీరోకు ఆ సమస్య ఎలా వచ్చింది అన్నదే కాకుండా దాని నుంచి బయటపడే ప్రయత్నాలు ఎఫెక్టివ్‌గా రాసుకోలేదు. ఆ సన్నివేశాలతో ఆడియెన్స్ కనెక్ట్ కావడం కష్టమే. తండ్రీకొడుకుల బంధాన్ని చూపించడంలో క్లారిటీ మిస్సయ్యింది. కొడుకుకు ఉన్న సమస్య గురించి తెలిసి కూడా తండ్రి అతడు చేసే పనులకు అడ్డు చెప్పడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. కామెడీ విషయంలో కొన్ని చోట్ల దర్శకుడు హద్దులు దాటాడు. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోయాయి.
వంద శాతం న్యాయం....
ప్రతాప్ పాత్రకు తిరువీర్ వంద శాతం న్యాయం చేశాడు. అమాయకుడైన పల్లెటూరి యువకుడిగా అతడి మ్యానరిజమ్స్, కామెడీ టైమింగ్ బాగున్నాయి. పాయల్ రాధాకృష్ణ పాత్రకు తగ్గట్లుగా నటించింది. ఎప్పుడూ కోపంతో ఊగిపోయే తండ్రిగా అజయ్ ఘోష్ చెలరేగిపోయాడు. తిరువీర్, అజయ్ ఘోష్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకున్నాయి. హీరో తల్లిగా రాశి సెటిల్డ్ యాక్టింగ్ కనబరిచింది.
ప్రసాద్ బెహరా, గోపరాజు రమణ కామెడీ బాగుంది. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
టైమ్‌పాస్ కామెడీ మూవీ....
పాపం ప్రతాప్ టైమ్‌పాస్ కామెడీ మూవీ. వినోదాన్ని ఆశించి థియేటర్లకు వచ్చే ఆడియెన్స్‌ను డిసపాయింట్ చేయలేదు.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



