త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OPPO F33, F33 Pro 5G | అదిరిపోయే సెల్ఫీ కెమెరా, భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన ఒప్పో కొత్త ఫోన్లు

OPPO F33, F33 Pro 5G | మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్లు ఎఫ్33 5జి, ఎఫ్33 ప్రొ 5జి ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. మిడ్ రేంజ్ విభాగంలో లాంచ్ అయిన ఈ ఫోన్ల‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఎఫ్3 ప్రొ ఫోన్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ దాని ఫ్రంట్ కెమెరా అని చెప్ప‌వ‌చ్చు.

S

Technology | Published On Apr 17, 2026, 10.20 am IST

OPPO F33, F33 Pro 5G | అదిరిపోయే సెల్ఫీ కెమెరా, భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన ఒప్పో కొత్త ఫోన్లు
Advertisement

OPPO F33, F33 Pro 5G | మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్లు ఎఫ్33 5జి, ఎఫ్33 ప్రొ 5జి ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. మిడ్ రేంజ్ విభాగంలో లాంచ్ అయిన ఈ ఫోన్ల‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఎఫ్3 ప్రొ ఫోన్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ దాని ఫ్రంట్ కెమెరా అని చెప్ప‌వ‌చ్చు. ముందు వైపు ఏకంగా 50 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. ఇది 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను ఇస్తుంది. దీని వ‌ల్ల ఎక్కువ మంది సెల్ఫీలో ఫిట్ అవుతారు. సాధార‌ణ సెల్ఫీ కెమెరా క‌న్నా 30 శాతం అద‌న‌పు ఏరియాను ఈ కెమెరా చిత్రీక‌రిస్తుంది. ఇక ఈ ఫోన్ల‌లో ప‌లు ఏఐ ఫీచ‌ర్ల‌ను ఇస్తున్నారు. వీటిని కెమెరాకు లేదా ఇత‌ర యాప్స్‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. కెమెరాల కోసం ఏఐ గ్రూప్ ఫైల్ ఎక్స్‌ప‌ర్ట్‌, ఏఐ పోర్ట్రెయిట్ గ్లో వంటి ఏఐ ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. ఈ ఫోన్ల‌కు ప్ర‌త్యేక‌మైన ఏఐ గ్లాస్ ఫినిషింగ్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల మిడ్ రేంజ్ ఫోన్లు అయిన‌ప్ప‌టికీ ప్రీమియం లుక్‌లో క‌నిపిస్తాయి.

ఒప్పో ఎఫ్33 5జి ఫోన్ ఫీచ‌ర్లు..

ఒప్పో ఎఫ్33 5జి ఫోన్ లో 6.57 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది. నాణ్య‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 6జీబీ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆధారిత హైప‌ర్ ఓఎస్‌3 ఇందులో ఉంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లే స్ప‌ష్టంగా క‌నిపించేలా 1400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఫోన్ డిస్‌ప్లేకు ఏజీసీ డీటీ-స్టార్ డీప్ల‌స్ ప్రొటెక్ష‌న్‌ను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మోనోక్రోమ్ సెన్సార్లు ఉండ‌గా, ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాలు ఉన్నాయి. 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ ఇందులో ఉండ‌గా, దీనికి 80 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. ఇక ఈ ఫోన్‌కు ఐపీ66, ఐపీ68, ఐపీ69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ కూడా ఉంది.

ఒప్పో ఎఫ్33 ప్రొ 5జి ఫీచ‌ర్లు..

ఒప్పో ఎఫ్33 ప్రొ 5జి ఫోన్ లో 6.57 ఇంచుల ఫ్లాట్‌ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల దీని డిస్‌ప్లే కూడా అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్‌లోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెస‌ర్‌నే ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆధారిత క‌ల‌ర్ఓఎస్ 16 ఇందులో ఉంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లే స్ప‌ష్టంగా క‌నిపించేలా దీనికి కూడా 1400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఫోన్ డిస్‌ప్లేకు ఏజీసీ డీటీ-స్టార్ డీప్ల‌స్ ప్రొటెక్ష‌న్ సైతం ల‌భిస్తోంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మోనోక్రోమ్ సెన్సార్లు ఉండ‌గా, ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాలు ఉన్నాయి. 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ ఇందులోనూ ఉంది. దీనికి కూడా 80 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. అలాగే ఈ ఫోన్‌కు కూడా డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ స‌దుపాయం ఇచ్చారు.

ధ‌ర వివ‌రాలు..

ఒప్పో ఎఫ్33 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.31,999 ఉండగా, 8జీబీ, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.34,999గా ఉంది. 8జీబీ, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.37,999గా నిర్ణ‌యించారు. అలాగే ఒప్పో ఎఫ్33 ప్రొ 5జి ఫోన్కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.37,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.40,999గా ఉంది. ఈ ఫోన్ల‌ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తున్నారు. వీటిని శుక్ర‌వారం నుంచే ప్రీ ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. లాంచింగ్ సంద‌ర్భంగా ఫోన్ల‌పై ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నారు. అన్ని ప్ర‌ధాన బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో ఈ ఫోన్‌ల‌పై ఫ్లాట్ 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. జీరో డౌన్ పేమెంట్‌తో 12 నెల‌ల ఈఎంఐ విధానంలోనూ వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. యూపీఐ ఆధారిత చెల్లింపుల‌పై 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఫోన్ విలువపై 10 శాతం అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ బోన‌స్ ను ఇస్తారు. ప్రీ ఆర్డ‌ర్లు చేసేవారికి 180 రోజుల కాల‌వ్య‌వ‌ధి క‌లిగిన వ‌న్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫ‌ర్‌ను ఉచితంగా ఇస్తున్నారు.

Advertisement
Advertisement