Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
Cabinet Decisions | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రూ.13,041 కోట్ల విలువైన ఐదు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది (Cabinet Decisions). ఇందులో నాలుగు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల పరిధిలో కీలకమైన రైల్వే మార్గానికి ప్రాధాన్యం దక్కింది.
Cabinet Decisions | త్రినేత్ర.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.13,041 కోట్ల విలువైన ఐదు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది (Cabinet Decisions). ఇందులో నాలుగు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు కాగా.. మరొకటి బీహార్‌లో నాలుగు లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్టు ఉంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు సుమారు 410 కిలోమీటర్ల మేర అదనపు ట్రాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.9,450 కోట్లుగా అంచనా వేశారు. దీన్ని 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రద్దీ తగ్గడం, ప్రయాణీకులు, సరకు రవాణా మెరుగుపడటంతో పాటు దాదాపు 60 లక్షల జనాభా ఉన్న 6,448 గ్రామాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రైల్వే ప్రాజెక్టుల వివరాలు ఇవే..
- ఏపీ, తమిళనాడు మధ్య ఉన్న గుమ్మిడిపూండి–గూడూరు (Gummidipundi-Gudur) రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దీంతో ఈ కీలక మార్గంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణికులకు, సరకు రవాణాకు మరింత మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ.2,286 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.
- పశ్చిమ బెంగాల్-ఒడిశా మధ్య ఉన్న ఖరగ్‌పూర్ - భద్రక్ (రాణిటాల్) రైల్వే మార్గంలో 4వ లైన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 173 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,352 కోట్లు.
- ఒడిశాలోని భద్రక్ - హరిదాస్‌పూర్ మధ్య 4వ లైన్‌ను (75 కి.మీ.) రూ. 1,583 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
- ఒడిశాలోని కటక్-పారాదీప్ మధ్య 3వ, 4వ లైన్ల (72 కి.మీ.)ను రూ. 2,286 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
రూ.3,590.73 కోట్లతో బీహార్ జాతీయ రహదారి అభివృద్ధి
బీహార్ (Bihar)లోని ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్‌బర్సా సెక్షన్‌ను (Muzaffarpur-Sitamarhi-Sonbarsa section) నాలుగు లేన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 82.578 కిలోమీటర్ల పొడవైన NH-22 మార్గాన్ని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.3,590.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ రహదారి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ను సీతామర్హి మీదుగా నేపాల్ సరిహద్దుకు సమీపంలోని సోన్‌బర్సాతో అనుసంధానించనుంది. ఈ ప్రాజెక్టు భారత్-నేపాల్ సరిహద్దు, బీహార్‌లోని ప్రధాన ఆర్థిక నగరాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read..
ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించాలి.. 16 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోరా?
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి.. ప్రకృతి అందాలను ఫొటోల్లో బంధించండి
22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ 'ఫ్రీ లీగల్ సెల్' : ఫోన్ నెంబర్ ఇదే!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?
- ●Ramchandar Rao | ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించాలి.. 16 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోరా?
- ●Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!
- ●Photo Journalists | ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి.. ప్రకృతి అందాలను ఫొటోల్లో బంధించండి
- ●Kavitha Name Change | కవిత.. పేరు మార్చుకోవాల్సిందే..!
- ●22A Lands Issue Telangana | 22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ 'ఫ్రీ లీగల్ సెల్' : ఫోన్ నెంబర్ ఇదే!

Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?

Ramchandar Rao | ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించాలి.. 16 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోరా?

Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!

Photo Journalists | ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి.. ప్రకృతి అందాలను ఫొటోల్లో బంధించండి






