త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని

Talasani Srinivas Yadav | బీఆర్ఎస్‌పై నోరు పారేసుకుంటున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న నోటి దుర‌ద త‌గ్గించుకోవాల‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హెచ్చ‌రించారు.

S

Hyderabad | Published On Aug 20, 2026, 1.40 pm IST

Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్‌పై నోరు పారేసుకుంటున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న నోటి దుర‌ద త‌గ్గించుకోవాల‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హెచ్చ‌రించారు. వెస్ట్ మారేడ్‌ప‌ల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి అనే సోయి మరిచి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్న‌రు. టిమ్స్ హాస్పిటల్ పనులు కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రారంభించాం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్‌లు కటింగ్ చేస్తున్నడు. ఎదుటి వారికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి అన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదని త‌ల‌సాని మండిప‌డ్డారు.

మహంకాళి జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే స్థానిక ఎమ్మెల్యేగా గౌరవించి స్వాగతం పలికాను. కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాల దృష్ట్యా సనత్ నగర్, అల్వాల్, కొత్తపేటలో టిమ్స్ ఆస్ప‌త్రుల‌కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మంది పిల్లలను మా పిల్లలుగా మేము చెప్పుకోం. మా ప్రభుత్వంలో 60 శాతం పనులు జరిగాయి. పనులు పూర్తి కాకుండా, సౌకర్యాలు కల్పించకుండానే హడావుడిగా హాస్పిటల్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది. హాస్పిటల్ సందర్శిస్తామంటే హౌస్ అరెస్టులు ఎందుకు చేశారు.. ఎందుకు అంత భయం అని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ నిల‌దీశారు.

22ఏ తీసుకొచ్చింది మీరు కాదా? పొరపాటు జరిగాయని మంత్రి క్షమాపణ చెప్పడం అంతా డ్రామా. 22ఏను అడ్డం పెట్టుకొని 30 నుండి 40 శాతం కమిషన్‌లు వసూలు సెటిల్‌మెంట్‌లు చేయలేదా? ప్రయివేట్ భూములు, పేదల ఇండ్లను 22ఏలో చేర్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement