Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
Meta | మెటా సంస్థలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన అవగాహన కంటెంట్‌ను నియంత్రించే విధానాలను మరింత బలోపేతం చేయాలని ఓవర్‌సైట్ బోర్డు సూచించింది. భారత్, బ్రెజిల్‌లో ప్రజా రవాణా వాహనాల్లో చిత్రీకరించిన రెండు వీడియోలకు సంబంధించిన కేసులను సమీక్షించిన అనంతరం బోర్డు ఈ సూచనలు చేసింది.
International | Published On Aug 20, 2026, 1.55 pm IST
Meta | మెటా సంస్థలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన అవగాహన కంటెంట్‌ను నియంత్రించే విధానాలను మరింత బలోపేతం చేయాలని ఓవర్‌సైట్ బోర్డు సూచించింది. భారత్, బ్రెజిల్‌లో ప్రజా రవాణా వాహనాల్లో చిత్రీకరించిన రెండు వీడియోలకు సంబంధించిన కేసులను సమీక్షించిన అనంతరం బోర్డు ఈ సూచనలు చేసింది. ఈ రెండు పోస్టులను తొలగిస్తూ మెటా తీసుకున్న నిర్ణయం తప్పని బోర్డు తేల్చింది. ఆ కంటెంట్ లైంగిక వేధింపులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిందని, అందువల్ల వాటిని పూర్తిగా తొలగించకుండా వయో పరిమితులు, హెచ్చరిక స్క్రీన్లతో ప్లాట్‌ఫామ్‌లపై కొనసాగించాల్సి ఉందని పేర్కొంది. మొదటి కేసులో 2025 నవంబర్‌లో ప్రముఖ భారతీయ వార్తా సంస్థకు చెందిన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియోను పోస్టు చేశారు. అందులో బస్సులో తనను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడని ఆరోపించిన ఓ వ్యక్తిని ఒక మహిళ నిలదీస్తున్న దృశ్యాలు ఉన్నాయి.
పాలసీలు, మార్గదర్శకాల మధ్య వ్యత్యాసాలు..
రెండో కేసులో గత డిసెంబర్‌లో బ్రెజిల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు. అందులో బస్సులో ఓ మహిళ పక్కన కూర్చున్న వ్యక్తి దుస్తులు ధరించినప్పటికీ తన జననాంగాలను పట్టుకున్న దృశ్యం కనిపించింది. రెండు పోస్టుల్లోనూ ప్రజా రవాణాలో మహిళల భద్రత, లైంగిక వేధింపులపై ఆందోళనలను ప్రస్తావించే క్యాప్షన్లు ఉన్నాయి. మెటా తొలుత ఈ రెండు పోస్టులను అడల్ట్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ పాలసీ కింద తొలగించింది. అయితే ఓవర్‌సైట్ బోర్డు జోక్యం చేసుకున్న తర్వాత సంస్థ ఆ కంటెంట్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే వయో పరిమితి, హెచ్చరిక స్క్రీన్లను అమలు చేసింది. ఈ కేసులు మెటా కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలోని కొన్ని లోపాలను బయటపెట్టాయని బోర్డు పేర్కొంది. ముఖ్యంగా ప్రజలకు వెల్లడించే పాలసీలు, కంటెంట్ మోడరేటర్లకు అందించే అంతర్గత మార్గదర్శకాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపింది.
మెటాకు ఆదేశాలు..
అడల్ట్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ పాలసీలోని అవగాహన కంటెంట్‌కు సంబంధించిన మినహాయింపును మెటా విస్తరించాలని బోర్డు సిఫారసు చేసింది. ప్రస్తుతం అంగీకారం లేకుండా జరిగే లైంగిక స్పర్శకు మాత్రమే పరిమితమైన ఈ మినహాయింపును ఇతర రకాల లైంగిక హింసకు సంబంధించిన అవగాహన కంటెంట్‌కూ వర్తింపజేయాలని సూచించింది. ఇదే తరహా మినహాయింపును అడల్ట్ న్యూడిటీ అండ్ సెక్సువల్ యాక్టివిటీ పాలసీలోనూ కల్పించాలని కోరింది. అనుమతి లేకుండా వ్యక్తులను చిత్రీకరించే క్రీప్‌షాట్స్ పై కూడా మెటా నిబంధనలను స్పష్టీకరించాలని బోర్డు కోరింది. ప్రజల్లో లైంగిక వేధింపులను ఖండించేందుకు ఉద్దేశించినప్పటికీ, కొన్ని రకాల బహిరంగ లైంగిక ప్రవర్తన దృశ్యాలను తొలగించాలని మెటా అంతర్గత మార్గదర్శకాలు సూచిస్తున్నట్లు బోర్డు గుర్తించింది. అదేవిధంగా ఈ పోస్టులను ఇతర వినియోగదారులకు సిఫారసు చేయకుండా తీసుకున్న మెటా నిర్ణయాన్ని కూడా బోర్డు విమర్శించింది. ఇలాంటి చర్యల వల్ల బాధితులు, వారి తరఫున మాట్లాడేవారు, ఇతర అవగాహన కార్యకర్తలు లైంగిక హింసపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, విధానపరమైన మార్పుల కోసం ప్రచారం చేసేందుకు మెటా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే అవకాశం దెబ్బతింటుందని పేర్కొంది.
సున్నితమైన కంటెంట్‌కు హెచ్చరికలు ఇవ్వడాన్ని, ఆ కంటెంట్‌ను సిఫారసు చేయకుండా ఉండడాన్ని వేర్వేరు చర్యలుగా చూడాలని ఓవర్‌సైట్ బోర్డు మెటాను కోరింది. తద్వారా లింగ ఆధారిత హింసపై చట్టబద్ధమైన చర్చలు, అవగాహన కార్యక్రమాలు లక్ష్య ప్రేక్షకులకు చేరేలా చూడటంతోపాటు మైనర్లు, ఇతర వినియోగదారులకు అవసరమైన భద్రతా చర్యలను కొనసాగించవచ్చని తెలిపింది.
సంబంధిత వార్తలు

WhatsApp | స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..
ఆగస్టు 14, 2026

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026

Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..

Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని

Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్



