Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
Amitabh Bachchan | బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఆరోగ్యంపై ఊహాగానాలకు తెరపడింది. తాను క్షేమంగా ఉన్నానంటూ బిగ్‌బీ వెల్లడించారు.
Amitabh Bachchan | త్రినేత్ర.న్యూస్: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఆరోగ్యంపై ఊహాగానాలకు తెరపడింది. తాను క్షేమంగా ఉన్నానంటూ బిగ్‌బీ వెల్లడించారు. అభిమానాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ.. ‘ప్రేమ, ప్రార్థనలు.. ఇంకా మరెన్నో..’ అంటూ తన బ్లాగ్‌లో పోస్టు పెట్టారు.

కాగా, ముంబైలోని నానావతి దవాఖానలో (Hospitalization) అమితాబ్ చేరినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయన మే 16న హాస్పిటల్‌కు వెళ్లిన విషయం వాస్తవమేనని, అది కేవలం రొటీన్ చెకప్ కోసమేనని బిగ్‌బీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారని తెలిపాయి. తన వ్యక్తిగత వైద్యుడు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన డాక్టర్ జయంత్ బర్వే ఆయనకు పరీక్షలు నిర్వహించారని పేర్కొన్నాయి. 83 ఏండ్ల బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ కల్కి సీక్వెల్‌తోపాటు సెక్షన్ 84 అనే మూవీలో నటిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు
- ●V Srinivas Goud | రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Strategic MoU | తెలంగాణ–లివర్‌పూల్ మధ్య కీలక ఒప్పందం
- ●Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్
- ●Civil Supplies Department | బకాయి సీఎంఆర్ చెల్లించకుంటే ఆస్తుల జప్తు!
- ●Rajanna Sircilla | రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం

CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు

V Srinivas Goud | రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

Strategic MoU | తెలంగాణ–లివర్‌పూల్ మధ్య కీలక ఒప్పందం

Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్






