Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్‌సిరీస్ – సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రకాష్‌రాజ్‌కు మెగా ఫ్యామిలీతో రాజకీయాల పరంగా విభేదాలు నడుస్తోన్నాయి. అ గొడవలతో సంబంధం లేకుండా ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఓ తెలుగు వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. జగమే సంగీతం పేరుతో రూపొందిన ఈ సిరీస్‌కు సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఏ ఓటీటీలో...ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
Entertainment | Published On Aug 20, 2026, 2.16 pm IST
Sushmita Konidela | మన శంకరవరప్రసాద్‌గారుతో నిర్మాతగా బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకుంది మెగా డాటర్ సుస్మిత కొణిదెల. చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 400 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. మన శంకరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్ తర్వాత సుస్మిత కొణిదెల ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. ఈ సిరీస్‌కు సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహించాడు. జగమే సంగీతం పేరుతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి.
ప్రకాష్ రాజ్...
ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మంధుబాల, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి కీలక పాత్రల్లో నటించారు. కుమారి 21 ఎఫ్, 18 పేజేస్ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ తెలుగు వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. కర్ణాటక సంగీతం బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. తాతాశాస్త్రి కర్ణాటక సంగీతంలో గొప్ప విద్యాంసుడిగా పేరుతెచ్చుకుంటాడు. తాతాశాస్త్రి వారసత్వాన్ని బాలు అందుకోవాలని కలలు కంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? తాతాశాస్త్రి గతం బాలు సంగీత ప్రయాణానికి ఎలా అడ్డంకిగా మారిందనే అంశాలతో ఈ సిరీస్‌ను రూపొందించారు.
సీతారామం...ఫౌజీ...
మ్యూజికల్ వెబ్‌సిరీస్‌కు సీతారామం, ఫౌజీ సినిమాల ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సుమన్, సుజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హిందీలో విమర్శకుల ప్రశంసలను అందుకున్న బందిష్ బాండిల్స్ వెబ్‌సిరీస్ ఆధారంగా జగమే సంగీతం రూపొందుతోంది.
రాజకీయంగా...
రాజకీయంగా మెగా ఫ్యామిలీతో ప్రకాష్ రాజ్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌తో పాటు నాగబాబుపై పలుమార్లు ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. వాటితో సంబంధం లేకుండా ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ చిరంజీవి కూతురు సుస్మిత వెబ్‌సిరీస్‌ను నిర్మించడం ఆసక్తికరంగా మారింది. సుకుమార్ శిష్యుడైన పల్నాటి సూర్యప్రతాప్ కుమారి 21 ఎఫ్, 18 పేజేస్ సినిమాలతో దర్శకుడిగా విజయాలను అందుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు ఫాంటసీ కామెడీ మూవీ – సూర్య కరుప్పుతో కంపేరిజన్స్
ఆగస్టు 18, 2026

Telugu OTT | సైలెంట్‌గా ఓటీటీలో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ – భార్యాభర్తల మధ్యలోకి లేడీ సైకో ఎంటరైతే!
ఆగస్టు 14, 2026

Megha Akash | ఒకే సారి ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాష్ రెండు తెలుగు సినిమాలు
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని



