BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
BRSV | పదో తరగతి పూర్తయ్యాక.. పాలిటెక్నిక్ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న కోర్సులను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
BRSV | త్రినేత్ర.న్యూస్ : పదో తరగతి పూర్తయ్యాక.. పాలిటెక్నిక్ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న కోర్సులను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ.. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ విద్యా విధానానికి అనుకూలంగా జీఓ నం. 97 కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నుండి తప్పించుకోవడానికే.. శక్తి పథకానికి అనుసంధానం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీకి గుర్తింపు తీసుకురావడానికి పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీలో చదివిన వారికి అసలు ఉద్యోగాలు రావట్లేదు. స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులు చదవడానికి ఆసక్తి చూపట్లేదని.. పాలిటెక్నిక్ విద్యార్థులను ఐటీఐ విద్యార్థుల వలే చూడవద్దని డిమాండ్ చేస్తున్నాం. ప్రశ్నించిన విద్యార్థుల గొంతులను పోలీసులను పెట్టి నొక్కుతారా? అని ప్రభుత్వంపై శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మోడల్ పేరిట ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు లబ్ధి చేకూరే విధంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో జీఓ నం. 97 తీసుకువచ్చింది. ఇప్పటికే ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకుంది అని గెల్లు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
ఆగస్టు 20, 2026

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..

Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని

Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్



