PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!
PM KISAN | రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించాయి. వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్నదాతలు వ్యవసాయ పనులూ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది.
PM KISAN | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించాయి. వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్నదాతలు వ్యవసాయ పనులూ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకం డబ్బులను వచ్చే నెల విడుదల చేయనుంది. దీంతో లబ్ది దారులు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రూ.2 వేల చొప్పున మూడు వాయిదాలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నది.
గత విడత వచ్చి దాదాపు నాలుగు నెలలు కావస్తుండటంతో.. షెడ్యూల్ ప్రకారం ఈ మొత్తాన్ని జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం అధికారిక తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈ డబ్బులు అందాలంటే ఈ-కేవైసీ పూర్తి చేయడానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈలోపు ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు మలి విడత పీఎం కిసాన్ డబ్బులు జమకాకపోవచ్చు.
ఎలా చేయాలంటే..
ఈ-కేవీసీ చేసుకోవాలంటే అన్నదాతలు తమకు సమీపంలో ఉంటే కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఇంట్లోనే ఉండి, అధికారిక పీఎం-కిసాన్ పోర్టల్ (PM Kisan Portal) ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఆధార్ ఓటీపీ సాయంతో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు
- ప్రతి 4 నెలలకోసారి రూ.2000 చొప్పున ఏడాదికి మూడుసార్లు డబ్బులు జమ అవుతాయి.
- ప్రభుత్వం ఇప్పటివరకు 22 విడతలను విజయవంతంగా విడుదల చేసింది.
- తదుపరి 23వ విడత నిధులు 2026 జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది.
- తదుపరి విడత డబ్బులు సకాలంలో మీ ఖాతాలో పడాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!

RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ

RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!






