త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | దేశ‌వ్యాప్తంగా భానుడి భ‌గ‌భ‌గ‌లు.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ కీల‌క సూచ‌న‌లు

PM Modi | దేశ‌వ్యాప్తంగా (across India) ఎండ‌లు మండిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉన్న‌ వేళ ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

D

National | Published On May 27, 2026, 12.52 pm IST

PM Modi | దేశ‌వ్యాప్తంగా భానుడి భ‌గ‌భ‌గ‌లు.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ కీల‌క సూచ‌న‌లు
Advertisement

PM Modi | దేశ‌వ్యాప్తంగా (across India) ఎండ‌లు మండిపోతున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి (rising temperatures). దీంతో తీవ్ర‌మైన వ‌డ‌గాల్పుల‌కు ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉన్న‌ వేళ ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

శరీరంలో నీటి శాతం త‌గ్గ‌కుండా చూసుకోవాల‌ని, వ‌డ‌దెబ్బ ల‌క్ష‌ణాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని ఎక్స్ వేదిక‌గా కీల‌క పోస్టు పెట్టారు. “దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఎండ తీవ్రత మనందరిపై తీవ్ర‌ ప్రభావం చూపుతోంది. అందుకే ప్ర‌జ‌లంతా త‌గిన‌ జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. శ‌రీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. వీలైనంత వ‌ర‌కూ ఇంటిప‌ట్టునే ఉండండి. ఒక‌వేళ ఇంటి నుంచి బయటకు వెళ్తే.. వెంటే నీటిని కూడా తీసుకెళ్లండి. ఆ స‌మ‌యంలో దాహంతో ఉన్న వారికి ఓ గ్లాసు నీరు ఇచ్చి సాయం చేయండి” అని ప్ర‌ధాని మోదీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

తీవ్రమైన వేసవి కాలంలో పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్ర‌ధాని సూచించారు. కళ్లు తిరగడం, వికారం, తీవ్రమైన అలసట వంటి వడదెబ్బ లక్షణాలు క‌నిపిస్తే నిర్ల‌క్ష్యం చేయొద్ద‌న్నారు. ఇత‌రుల్లో కూడా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వారికి సాయం చేయాల‌ని పిలుపునిచ్చారు. వారిని చ‌ల్ల‌గా, నీడ ఉన్న ప్ర‌దేశానికి త‌ర‌లించాల‌న్నారు. వారికి నీరు, ఓఆర్ఎస్ వంటివి అందించాల‌ని సూచించారు. ఆప‌ద‌లో ఉన్న వారికి సాయం అందించాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. అలాగే మూగ‌జీవాల ప‌ట్ల కూడా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌న్నారు. జంతువులు, ప‌క్షుల ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు. ఇళ్లు, బాల్క‌నీలు, టెర్ర‌స్‌లు, దుకాణాలు, కార్యాల‌యాల బ‌య‌ట ప‌క్షులు, జంతువుల కోసం నీటిని ఉంచాల‌ని కోరారు.

Also Read..

ఈసీ చేప‌డుతున్న SIR చట్టబద్ధమే.. సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు.. ఐరాస వేదిక‌గా పాక్ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను ఎండ‌గ‌ట్టిన భార‌త్‌

ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Advertisement
Advertisement