Ponnam Prabhakar | ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నప్పటికీ, తెలంగాణలో 2019 నుంచే వీటిని ప్రవేశపెట్టారని చెప్పారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నప్పటికీ, తెలంగాణలో 2019 నుంచే వీటిని ప్రవేశపెట్టారని చెప్పారు. అది కూడా జీసీసీ (GCC) విధానంలోనే అని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 960 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టామన్నారు. అదేవిధంగా ఇంటర్‌సిటీ కనెక్షన్ల కోసం మరో 500 ఎలక్ట్రిక్ బస్సులను కూడా మంజూరు చేశామని తెలిపారు. కూకట్‌పల్లి డిపోలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో వచ్చే మరో 200 ఎలక్ట్రిక్ బస్సులను పీఎంఈ డ్రైవ్ పథకం ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ ఇంజిన్..
దీంతో పాటు రిట్రోఫిట్‌మెంట్ విధానంలో ప్రస్తుతం ఉన్న 20 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ ఇంజిన్‌లతో మార్చడం చేయడం ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ఇంకా విస్తరించే ప్రయత్నం జరుగుతున్నదని వెల్లడించారు. మరో 250 బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఆ తర్వాత మరిన్ని డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పిడి చేసే అవకాశం ఉంన్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి కూడా మంచి వాతావరణం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా డీజిల్ బస్సుల వల్ల వచ్చే పొగ, కాలుష్యం తగ్గిపోవడంతో వారికి ఆరోగ్యకరమైన పని వాతావరణం ఏర్పడుతుందన్నారు.
సౌకర్యవంతమైన, మృదువైన ప్రయాణం
ప్రయాణికులకు కూడా చాలా సౌకర్యవంతమైన, మృదువైన ప్రయాణ అనుభవం లభిస్తుందని చెప్పారు. మనం సుమారు 3000 బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చగలిగితే, ప్రతిరోజూ దాదాపు 600 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలమన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు అవుతుంది. త్వరలో జేటీఎంలను కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని తెలిపారు.
సంబంధిత వార్తలు

Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్
మే 27, 2026

RTC Driver Ashok Job | రైతుల కోసం మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారా? అసలు నిజం బయటపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
మే 26, 2026

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
మే 26, 2026
తాజావార్తలు
- ●HMD | రూ.10 వేలలోపు 5జీ ఫోన్.. హాట్ కేక్‌లా అమ్మకాలు.. గంటలోనే సేల్ అవుట్..
- ●Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
- ●Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ●POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష
- ●Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు

HMD | రూ.10 వేలలోపు 5జీ ఫోన్.. హాట్ కేక్‌లా అమ్మకాలు.. గంటలోనే సేల్ అవుట్..

Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..

Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు



