త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | స‌రిప‌డా ఇంధ‌న నిల్వ‌లు ఉన్నాయి : ప్ర‌ధాని మోదీ

PM Modi | ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న సంక్షోభం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థను కుదిపేసింద‌ని, దీన్నుంచి కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) అన్నారు.

D

National | Published On Mar 24, 2026, 3.23 pm IST

PM Modi | స‌రిప‌డా ఇంధ‌న నిల్వ‌లు ఉన్నాయి : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న సంక్షోభం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థను కుదిపేసింద‌ని, దీన్నుంచి కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) అన్నారు. యుద్ధం సుదీర్ఘ కాలం కొన‌సాగితే అప్పుడు ప‌రిస్థితులు భ‌యాన‌కంగా ఉంటాయ‌ని ఆందోళన వ్యక్తం చేశారు.

మ‌ధ్య‌ప్రాచ్చంలో ప‌రిస్థితుల‌పై రాజ్య‌స‌భ‌ (Rajya Sabha)లో ప్ర‌ధాని మాట్లాడారు. మూడు వారాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధం అప్పుడే భారీ ఇంధన సంక్షోభానికి దారితీసింద‌ని చెప్పారు. కీలక వాణిజ్య మార్గాలకు విఘాతం కలిగించిందని పేర్కొన్నారు. "ఈ యుద్ధం ప్రపంచంలో తీవ్రమైన ఇంధన సమస్యకు దారితీసింది. భారత్‌కు కూడా ఈ పరిస్థితి ఆందోళనకరం. యుద్ధం కారణంగా మన వాణిజ్య మార్గాలు దెబ్బతిన్నాయి. దీనివల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది" అని ప్ర‌ధాని అన్నారు.

మిడిల్ ఈస్ట్‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్లు చెప్పారు. "మన ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. మారుతున్న ప్రతి పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గ‌మ‌నిస్తోంది. ప‌రిస్థితుల ప్ర‌భావం మ‌న‌పై ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం" అని ప్ర‌ధాని పేర్కొన్నారు. చ‌ర్చ‌లు, దౌత్యం ద్వారా శాంతిని నెల‌కొల్పాల‌ని భావిస్తున్నామ‌న్నారు. ఒక‌వేళ ప‌శ్చిమాసియా ప‌రిస్థితులు సుదీర్ఘ కాలం కొన‌సాగితే అప్పుడు ప‌రిస్థితులు భ‌యాన‌కంగా ఉంటాయ‌న్నారు.

ప్ర‌స్తుతం మ‌న‌కు ముడి చ‌మురు, ఎల్పీజీ నిల్వ‌లు స‌రిప‌డా ఉన్నాయ‌న్నారు. భార‌త్ వ‌ద్ద ప్ర‌స్తుతం 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల రిజ‌ర్వ్ ఇంధ‌నం ఉన్న‌ట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య‌ను 65 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు చేర్చ‌నున్న‌ట్లు తెలిపారు. ఇంధ‌న నౌక‌ల త‌యారీ ప్రాజెక్టు కోసం సుమారు 70 వేల కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు. గ‌ల్ఫ్ దేశాల్లో సుమారు కోటి మంది భార‌తీయులు నివ‌సిస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని వెల్ల‌డించారు. సంక్షోభ స‌మ‌యాల్లో భార‌తీయుల భ‌ద్ర‌తే త‌మ ప్ర‌భుత్వ తొలి ప్రాధాన్య‌మ‌ని చెప్పారు. యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి 3,75,000 మందికిపైగా భార‌తీయులు సుర‌క్షితంగా స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. వీరిలో ఇరాన్ నుంచి వ‌చ్చిన వారు వెయ్యి మంది అని చెప్పారు. 700 మంది వైద్య విద్యార్థులు కూడా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

Also Read..

భీమ్ యాప్‌లో కొత్త ఫీచ‌ర్‌.. పిన్ లేకుండానే పేమెంట్స్ చేసుకోవ‌చ్చు

రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. రీఫండ్‌, క్యాన్సిలేష‌న్ రూల్స్ మారాయి..

వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన స్విగ్గీ.. ప్లాట్‌ఫాం ఫీజు పెంపు..

Advertisement

తాజావార్తలు

Advertisement